Mercury Transit 2022: మిథునంలోకి ప్రవేశించనున్న బుధుడు.. జూలై 2 నుంచి ఈ 3 రాశుల వారికి మహర్దశ..

Mercury Transit July 2022: ఈ నెల 2న బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడి రాశి మార్పు మూడు రాశుల వారికి బాగా కలిసిరానుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2022, 08:57 AM IST
  • బుధ గ్రహం రాశి మార్పు
  • మిథునంలోకి ప్రవేశించనున్న బుధుడు
  • బుధుడి రాశి మార్పుతో 3 రాశుల వారికి శుభాలు
Mercury Transit 2022: మిథునంలోకి ప్రవేశించనున్న బుధుడు.. జూలై 2 నుంచి ఈ 3 రాశుల వారికి మహర్దశ..

Mercury Transit July 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల ప్రతీ కదలిక రాశిచక్రంలోని 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గ్రహాలు రాశులు మారినప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత జూలై నెలలో 5 పెద్ద గ్రహాలు రాశులు మారనున్నాయి. ఈ నెల 2న బుధ గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించనుంది. బుధ గ్రహం రాశి మారడం వల్ల మూడు రాశుల వారికి కలిసిరానుంది. ఆ మూడు రాశులేంటి.. వారికి కలిగే శుభాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.. 

వృషభ రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథునరాశిలో బుధుడి సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిచక్రంలోని రెండవ ఇంట్లో బుధ గ్రహం సంచరించబోతోంది. ఇది ఆర్థికపరంగా కలిసొస్తుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారులు పెద్ద ఆర్డర్స్ పొందుతారు. కొత్త ఒప్పందాలు జరుగుతాయి. ఇతరుల భాగస్వామ్యంతో వ్యాపార విస్తరణ చేపడుతారు. న్యాయవాదులు, ఉపాధ్యాయులు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇది బాగా కలిసొచ్చే సమయం.

సింహ రాశి : ఈ రాశిచక్రం 11 వ ఇంట్లో బుధుడు సంచరించబోతున్నాడు. ఇది ఆదాయపరంగా సింహ రాశి వారికి కలిసొస్తుంది. ఈ కాలంలో ఆదాయం పెరగవచ్చు. వ్యాపారం, వృత్తిలో ప్రత్యేక విజయాన్ని పొందవచ్చు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. బుధుడు సింహరాశి రెండవ ఇంటికి అధిపతి అయినందునా ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఈ సందర్భంలో ఆకస్మిక ధన లాభం ఉండొచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు. 

కన్య రాశి : బుధుడు ఈ రాశిలో పదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది వ్యాపారం, ఉద్యోగ రంగాల్లోని వారికి అనుకూలిస్తుంది. ఈ సమయంలో కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. అదే సమయంలో, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ లేదా పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు విస్తరణకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త సంబంధాలు లాభాలను అందిస్తాయి.మిథునరాశిలో బుధుడు సంచరించడం వల్ల కన్యారాశి వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. 

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధ్రువీకరించలేదు.)

Also Read: Hero Vishal: కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ? క్లారిటీ ఇచ్చిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి..

Also Read: PM MODI Hyderabad Tour: హైదరాబాద్ లో మూడు రోజులు ప్రధాని మోడీ టూర్.. ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలుసా..? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News