Mars transit 2023: మరో 5 రోజుల్లో ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?

Mars transit 2023: ధైర్యానికి కారకుడైన అంగారకుడు మరో 5 రోజుల్లో కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కొందరి జీవితం వెలుగులమయం కానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 5, 2023, 04:15 PM IST
Mars transit 2023: మరో 5 రోజుల్లో ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?

Mangal Gochar 2023 effect: హిందూ పంచాంగం ప్రకారం, గ్రహాల రాశి మార్పు అనేది సహజం. గ్రహాల కదలిక ప్రభావం ప్రజల జీవితాలపై ఎంతో కొంత ఉంటుంది. జ్యోతిష్యులు కూడా మన జాతకంలోని గ్రహాల స్థానాలను బట్టే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెబుతారు. ఈ నేపథ్యంలో గ్రహాల కమాండరైన కుజుడు ఈనెల 10న తన రాశిని ఛేంజ్ చేయబోతున్నాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నారు. దైర్యానికి కారకుడైన అంగారకుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి 
ఇదే రాశిలో అంగారక సంచారం జరగబోతుంది. దీంతో వీరిపై కాసుల వర్షం కురవనుంది. ఈ రాశి వారు ఏ పనిని తలపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగుల జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు.
కన్యా రాశి
కుజుడు సంచారం మీ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో సంభవించబోతుంది. మీరు ఈ సమయంలో విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమలో విభేదాలు రావచ్చు, అయితే అవి సర్దుకుంటాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది. 
కుంభరాశి
మీ రాశి యొక్క ఎనిమిదవ ఇంట్లో మార్స్ సంచరిస్తున్నాడు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు ఫ్యామిలీ సపోర్టుతో ప్రతి కార్యాన్ని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది.

Also Read: Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఈ 4 రాశుల వారికి అస్సలు కలిసిరాదు.. ఇందులో మీది ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News