Mangal Gochar in June 2022 Effect: జ్యోతిషశాస్త్రంలో అంగారక గ్రహం.. శక్తి, ధైర్యం, భూమి, వివాహం మెుదలైన వాటికి కారకంగా వర్ణించబడింది. కాబట్టి జాతకంలో కుజుడు సరైన స్థానం చాలా ముఖ్యం. వచ్చే జూన్ 27న అంగారక గ్రహం రాశిచక్రాన్ని మారుస్తోంది. కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు (MarsTransit in Aries 2022), ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. మరోవైపు అంగారక సంచారం 3 రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వారు వృత్తిలో పురోగతితో పాటు ధన ప్రయోజనాలు, వైవాహిక ఆనందం పొందుతారు.
మిథునం (Gemini): మిథున రాశి వారికి అంగారక సంచారం శుభప్రదం. ఈ సమయంలో వారి ఆదాయం పెరుగుతుంది. కెరీర్ దూసుకుపోతుంది. మీ పనిలో మెరుగుదల మీ ఇమేజ్‌ని మెరుగుపరుస్తుంది. వ్యాపారంలో పరిస్థితి బాగుంటుంది. ధనలాభం పెరుగుతుంది. కొత్త ఆర్డర్లు లేదా డీల్‌లు సెటిల్ కావచ్చు. పార్టనర్‌షిప్‌లో పనిచేసే వారికి పెద్ద లాభాలు వచ్చే అవకాశం ఉంది. వివాహితులకు వారి జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి అంగారక సంచారం చాలా మంచిది. మీరు ఉద్యోగాలు మార్చుకోవచ్చు. కొత్త జాబ్ ఆఫర్ మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ప్రమోషన్-జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. మీరు వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టాలనుకుంటే..ఈ సమయం అనుకూలం.
సింహం (Leo): కుజుడు రాశిలో మార్పు సింహరాశి వారికి అదృష్టం. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు వేగంగా సాగుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రయాణం మీకు పెద్ద ప్రయోజనాలను ఇస్తుంది. పరీక్ష-ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధించగలరు.
Also Read: Vakri Shani 2022: జూలై 12న మకర రాశిలో తిరోగమన శని సంచారం.. ఈ రాశులవారికి నరకం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook