Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..

Mars Transit 2024: జూలై 12వ తేదీన మిధున రాశిలోకి అంగారక గ్రహం సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 7, 2024, 10:39 AM IST
Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..

Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజుడు జులై రెండవ వారంలో రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఈ సంచారం జూలై 12వ తేదీన రాత్రి 7 గంటలకు జరగబోతోంది. ఇదిలా ఉంటే కుజ గ్రహం మళ్లీ ఆగస్టు 26వ తేదీన మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం ఏ రాశిలోనైనా దాదాపు 45 నుంచి 46 రోజులపాటు సంచార దశలోనే ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తుల జాతకాల్లో కుజ గ్రహం శుభస్థానంలో ఉన్న వారికి విపరీతమైన ధన లాభాలతో పాటు అదృష్టం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అయితే కుజ గ్రహ సంచారం గోల్డెన్ ఛాన్సులను కూడా అందిస్తుంది. అయితే ఈ సంచారం కారణంగా జూలై 12వ తేదీ నుంచి ఏయే రాశుల వారి జీవితాల్లో మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.

సింహరాశి: 
కుజ గ్రహ సంచారం కారణంగా సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఈ సమయంలో మంచి శాఖల నుంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఎప్పటినుంచో పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశించిన కంపెనీలో నుంచి ఆఫర్స్ లభిస్తాయి. దీంతో పాటు ఈ 46 రోజులు సింహ రాశి వారికి కుటుంబ పరంగా ఎలాంటి లోటు ఉండదు. అలాగే వీరికి ఈ సమయంలో ధైర్యం పెరిగి ఎలాంటి పనులైనా ఎంతో సులభంగా చేసేందుకు ఇష్టపడతారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు కొత్త ఇల్లతో పాటు కారు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే ఆదాయ వనరులు కూడా విపరీతంగా పెరుగుతాయి.

కన్యా రాశి: 
కుజుడి సంచారం కారణంగా కన్యా రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకున్న పనులు జరగడమే కాకుండా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా విపరీతమైన ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఈ సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేసిన మంచి లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారాల విస్తరణ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇక ఉద్యోగాలు చేసే వారి విషయానికి వస్తే ఈ సమయంలో వీరు కొత్త బాధ్యతలు పొందడమే కాకుండా పదోన్నతులు కూడా పొందుతారు. అలాగే విద్యార్థులకు సమాజంలో కీర్తి పెరిగి మంచి ర్యాంకులు కూడా సాధించే అవకాశాలున్నాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వృశ్చిక రాశి: 
కుజుడి అనుగ్రహం వల్ల వృశ్చిక రాశి వారు కూడా చాలా వరకు లాభాలు పొందుతారు.. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రభుత్వ పనుల్లో విజయాలు సాధించడమే, కాకుండా కొత్త ఆదాయ వనరులను కూడా పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ నెల మొత్తం వీరికి అనుకూలంగా ఉండడం వల్ల ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించగలుగుతారు. అలాగే కొత్త ఆస్తులతో పాటు గృహాలు కూడా కొనుగోలు చేస్తారు. ఇక ఎప్పటినుంచో అనుకుంటున్న పనులను కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. అలాగే వీరు వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా ఇతర లగ్జరీ వస్తువులను కూడా కొంటారు. దీంతోపాటు ఆస్తి వ్యవహారాల్లో ఎలాంటి చిక్కులు ఉన్న వీరే పై చేయి సాధిస్తారు.

మీనరాశి: 
అంగారకుడి సంచారం మీన రాశి వారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు ధైర్యాన్ని పొందడమే కాకుండా అనుకున్న ప్రతి పని ఎంతో సులభంగా చేస్తూ విజయాలు సాధిస్తారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆఫర్స్ లభిస్తాయి. అంతేకాకుండా అంగారకుడి అనుగ్రహంతో ఈ రాశి వారికి 46 రోజుల పాటు వ్యక్తిగత జీవితంలో పురోగతి లభిస్తుంది అలాగే వ్యాపారాల్లో వస్తున్న చిక్కులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీంతో పాటు కలలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News