Mars Transit 2023: కర్కాటకంలో మంగళ గ్రహం, వచ్చే 21 రోజులు ఈ 5 రాశులకు తిరుగుండదు

Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనం, గ్రహ గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాలు రాశి మారినప్పుడల్లా ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. మంగళ గ్రహం రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 11, 2023, 12:02 PM IST
Mars Transit 2023: కర్కాటకంలో మంగళ గ్రహం, వచ్చే 21 రోజులు ఈ 5 రాశులకు తిరుగుండదు

Mars Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క అంశానికి ప్రతీకగా నిలుస్తుంది. అదే విధంగా మంగళ గ్రహాన్ని సాహసం, పరాక్రమం, భూ సంపదలు, వివాహానికి కారకంగా భావిస్తారు. అందుకే మంగళ గ్రహం రాశి పరివర్తనం ప్రభావం అత్యంత కీలకంగా మారనుంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ గ్రహం మే 10వ తేదీన కర్కాటక రాశిలో ప్రవేశించింది. జూలై 1 వరకూ ఇదే రాశిలో ఉండనుంది. ఫలితంగా కొన్ని రాశులకు అమితమైన లాభాలు కలగనున్నాయి. ఈ జాతకులకు అపారమైన ధన సంపదలు, భూమి ఆస్థులు వంటివి దక్కనున్నాయి. అంటే మరో 21 రోజులు ఈ 5 రాశులకు అంతులేని ధన సంపదలు కలుగుతాయి. ఓ విధంగా చెప్పాలంటే మహర్దశ పట్టనుంది. హిందూ పంచాంగాల ప్రకారం కుండలిలో మంగళ గ్రహం స్థితి పటిష్టంగా ఉంటే జీవితంలో అన్నింటా విజయం తద్యమని జ్యోతిష్యులు చెబుతున్నారు. మే 10వ తేదీన కర్కాటక రాశిలో ప్రవేశించిన మంగళ గ్రహం జూలై 1 వరకూ అదే రాశిలో విరాజిల్లనున్నాడు. ఫలితంగా మరో 21 రోజులపాటు ఈ 5 రాశుల జాతకం మారిపోనుంది. 

తుల రాశి

తుల రాశి జాతకులకు మంగళ గ్రహం కర్కాటక రాశి ప్రవేశం సందర్భంగా 21 రోజుల పాటు అద్భుతంగా ఉండబోతోంది. పెట్టిన పెట్టుబడులు లాభాల్ని ఆర్జిస్తాయి. కొత్త వాహనాలు లేదా ఇళ్లు కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్ధులకు అనుకూలమైన సమయంగా భావిస్తున్నారు. వ్యాపారం విస్తృతమైన లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమౌతుంది.

మేష రాశి

మంగళ గ్రహం రాశి పరివర్తనం ప్రభావంతో మేష రాశి జాతకులకు శుభప్రదంగా ఉండనుంది. విద్యారంగంలో ఉండేవారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుంది. ఏ విధమైన సమస్య రాదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 

మిధున రాశి

మంగళ గ్రహం రాశి మారడం ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉండటం వల్ల మిధున రాశి జాతకులకు సాహసోపేతాలతో ఉంటారు. కుటుంబసభ్యులతో యాత్రలు చేయనున్నారు. ఆధాత్మిక యాత్రలపై ఆసక్తి పెరుగుతుంది. పెట్టుబడులకు మంచి సమయం. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. 

కన్యా రాశి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కన్యారాశి జాతకులకు మంచి సమయంగా భావిస్తారు. ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అద్భుత లాభాలుంటాయి. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపారులైతే లాభాలు ఆర్జించవచ్చు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులకు మంగళ గ్రహం గోచారంతో విశేషమైన లాభాలు కలగనున్నాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉండటం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావు. పనుల విషయంలో ఉండే సమస్యలు దూరమౌతాయి. ఉద్యోగులకు మంచి మంచి అవకాశాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Also read: Venus Transit 2023: జూలైలో శుక్రుని గమనంలో పెను మార్పు.. ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News