Mangala Gauri Vrat 2022: ఒకేరోజు శివరాత్రి, మంగళ గౌరీ వ్రతం... శుభముహూర్తం తెలుసుకోండి

Mangala Gauri Vrat 2022: జూలై 26..ఈ రోజు రెండు అద్భుతమైన యాదృచ్ఛికాలు జరుగునున్నాయి. ఒకటి మంగళ గౌరీవ్రతం, రెండోది మెుదటి శ్రావణ శివరాత్రి. ఈ రెండు వ్రతాలు చేయడం ద్వారా శివుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. పూజ ముహూర్తం గురించి  తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2022, 03:12 PM IST
Mangala Gauri Vrat 2022:  ఒకేరోజు శివరాత్రి, మంగళ గౌరీ వ్రతం... శుభముహూర్తం తెలుసుకోండి

Mangala Gauri Vrat 2022:  శ్రావణ మాసంలో రెండు ముఖ్యమైన పండుగలు ఒకరోజు వస్తున్నాయి. ఒకటి మంగళ గౌరీ వ్రతమైతే, మరొకటి శివరాత్రి. ఈ సారి శ్రావణ మాసం రెండో మంగళగౌరీ వ్రతం జూలై 26న రాగా.. అదే రోజు తొలి శ్రావణ శివరాత్రి (First Sravana Sivaratri 2022) రావడం విశేషం. తమ భర్త దీర్ఘాయువుతో ఉండాలని వివాహిత స్త్రీలు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు. శ్రావణ రెండో మంగళ గౌరీ వ్రతం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజున శివపార్వతులను పూజిస్తే..మీకు శుభం జరుగుతుంది. పార్వతీ దేవి మీకు అఖండ సౌభాగ్యం ప్రసాదిస్తుంది. 

మంగళ గౌరీ వ్రతం 2022 ముహూర్తం
శ్రావణ మాసం కృష్ణ పక్షం త్రయోదశి జూలై 26వ తేదీ సాయంత్రం 06.46 గంటల వరకు ఉంటుంది. తర్వాత చతుర్దశి ప్రారంభమవుతుంది. మాస శివరాత్రి చతుర్దశి నాడు వస్తుంది. ఈసారి శ్రావణ శివరాత్రి జూలై 26న వస్తుంది. కాబట్టి ఒకే రోజు రెండు వ్రతాలు చేయడం ద్వారా మీకు పుణ్యం లభిస్తుంది. 
అభిజిత్ ముహూర్తం: జూలై 26 మధ్యాహ్నం 12 నుండి 12:55 వరకు
రాహు కాలం: ఉదయం 03:52 నుండి సాయంత్రం 05:34 వరకు
భద్ర సమయం: సాయంత్రం 06:46 గంటల నుండి జూలై 27 ఉదయం 05:40 వరుకు.
శివరాత్రి ఆరాధనకు అనుకూల సమయం: మధ్యాహ్నం 12:07 నుండి 12:49 గంటల వరకు.

మంగళ గౌరీ వ్రతం ప్రాముఖ్యత
సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని పాటిస్తారు. తల్లి పార్వతి కఠోర తపస్సు చేసి పరమశివుడిని భర్తగా పొందింది. పెళ్లి అయిన వారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అఖండ సౌభాగ్యంతోపాటు పుత్ర సంతానం కూడా కలుగుతుంది. 

Also Read: Kamika Ekadashi 2022: కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వ్రతంలో పసుపు రంగుకు ఎందుకు అంత ప్రాధాన్యత? 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News