Mangal Gochar June 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని రెడ్ ఫ్లానెట్, క్రూర గ్రహంగా పిలుస్తారు. గ్రహాల కమాండరైన కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు జూలై 01 వరకు అతడు అదే రాశిలో ఉండనున్నాడు. అనంతరం సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశిలో అంగారక సంచారం వచ్చే నెల 01 వరకు కొన్ని రాశులవారికి సానుకూలంగా ఉండనుంది.
అంగారక సంచారం ఈ రాశులకు వరం
మేష రాశి- కర్కాటక రాశిలో కుజుడు సంచారం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి. మీ పనులకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది.
కర్కాటక రాశి- ఇదే రాశిలో అంగారకుడు సంచరిస్తున్నాడు. దీంతో ఈ రాశి వారు అనుకూల ఫలితాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది.
కన్య- కన్యారాశి వారికి కుజుడు సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆఫీసులో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈసమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం పొందనున్నారు.
Also Read: Mercury Set 2023: బుధుడి అస్తమయంతో ఈ 3 రాశుల జీవితం నాశనం.. ఇందులో మీరున్నారా?
తులరాశి- అంగారక సంచారం తులారాశి వారికి మేలు చేస్తుంది. జూలై 1 వరకు సమయం వారికి అద్భుతంగా ఉంటుంది. దీంతో మీరు మంచి లాభాలను గడిస్తారు. విద్యారంగానికి సంబంధించిన వారు ఈ సమయం బాగుంటుంది. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి ఫ్యూచర్ లో లాభాలను ఇస్తాయి. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మీనరాశి- కుజుడు సంచారం మీన రాశి వారికి శుభవార్తను ఇస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ మరియు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీలో ధైర్యం పెరుగుతుంది. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది.
Also Read: Surya Gochar 2023: మరో 2 రోజుల్లో ఈ 4 రాశులకు మహార్దశ.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి