Mahashivratri 2022: మహాశివరాత్రి నాడు ఈ 5 రాశుల వారికి శివుని అనుగ్రహం సిద్ధిస్తుంది!

Mahashivratri 2022: మహాశివరాత్రి నాడు గ్రహాల సంయోగ కారణంగా 5 రాశులపై మంచి ప్రభావం చూపనుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. . సదరు రాశులకు చెందిన వ్యక్తులు జీవితంలో అనేక విజయాలను అందుకోవడం సహా డబ్బును పొందుతారు. ఆ రాశుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 09:51 AM IST
Mahashivratri 2022: మహాశివరాత్రి నాడు ఈ 5 రాశుల వారికి శివుని అనుగ్రహం సిద్ధిస్తుంది!

Mahashivratri 2022: మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం (మార్చి 1) నాడు శివ నామ స్మరణతో శివాలయాలు మారుమ్రోగనున్నాయి. పరమశివుడు, పార్వతీ దేవీ పెళ్లి రోజు సందర్భంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు శివునికి అనేక అభిషేకాలు నిర్వహిస్తారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మహాశివరాత్రి రోజున చంద్రుడు, శని, శుక్ర, బుధ, కుజుడు పంచగ్రహి యోగంతో శని నక్షత్రం ఏర్పడుతుంది. ఈ మహా గ్రహ కలయిక 5 రాశులకు చాలా శుభప్రదం. ఈ రాశి వారికి శివుని అనుగ్రహం కలుగుతుంది. సదరు రాశులకు చెందిన వ్యక్తులు జీవితంలో అనేక విజయాలను అందుకోవడం సహా డబ్బును పొందుతారు. 

మహాశివరాత్రి నాడు ఈ రాశులపై శివుని అనుగ్రహం..

మేషరాశి (Aries) 

మహాశివరాత్రి నాడు మేష రాశి వారు పరమశివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. దీంతో వారి జీవితంలో ఆర్థిక పరిస్థితి బలంగా మారడం సహా వ్యాపారస్తులకు అనుకూల లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. 

వృషభం (Taurus)

మహాశివరాత్రి నాడు సంభవించే గ్రహాల కలయిక వల్ల వృషభ రాశికి అదృష్టం కలిసి వస్తుంది. దీని వల్ల అనేక రంగాల్లో విజయాలను సాధిస్తారు. అనేక రూపాల్లో డబ్బు వరిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితం బాగుంటుంది. వృషభ రాశి వారు మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని అనుగ్రహం కోసం చెరుకు రసం, పాలతో అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. 

మిథున రాశి (Gemini)

మిథున రాశి వారు మహాశివరాత్రి నాడు శుభవార్త వింటారు. ఈ పర్వదినం నాడు శివునికి అభిషేకం చేయించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యపాప్తి లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

తులారాశి (Libra)

ఈ మహాశివరాత్రి తులారాశి వారికి ఆనందంగా సాగుతుంది. ఈ రోజున మీరు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. కెరీర్ పరంగా వీరికి అంతా శుభప్రదంగా సాగుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. 

మకర రాశి (Capricorn)

మహాశివరాత్రి నాడు సంభవించే గ్రహాల కలయిక వల్ల మకర రాశి వారికి కూడా అనేక లాభాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో గొప్ప పురోగతి సాధిస్తారు. ప్రమోషన్స్, కొత్త ఉద్యోగాలు, ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు ఉన్నాయి. 

(నోట్: పైన ప్రేర్కొన్న సమాచారమంతా జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించబడినది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)   

Also Read: Mahashivratri 2022: మహాశివరాత్రి నాడు ఈ పూజలు చేస్తే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి!

Also Read: Maha Shivratri 2022: మీ రాశి ప్రకారం శివరాత్రి నాడు ఇలా శివుడిని పూజించండి.. అపార సంపద పొందండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News