Chandra Grahan 2022: ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25(నిన్న)న ముగిసింది. ఇక ఏడాది చివరి చంద్ర గ్రహణం విషయానికొస్తే నవబంర్ 8వ తేదిన ఏర్పడనుంది. దీనిని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పిలుస్తారు. ఒక చంద్ర గ్రహణానికి ముందు ఒక రోజూ ముందే దేవ్ దీపావళిని జరుపుకుంటారు. అయితే ఈ చంద్ర గ్రహణ ప్రభావవం కేవలం తూర్పు భాగాల్లో ప్రాంతాలపైనే ఎక్కువ ప్రభావవం పడబోతోందని ఖగోళ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ప్రజలంతా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలు కూడా ఈ క్రమంతో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే పుట్టబోయే బిడ్డపై తీవ్ర ప్రభావవం పడే ఛాన్స్ ఉంది.
ఈ గ్రహణం భారతదేశంలో కూడా కొన్ని తూర్పదిశలో ఉన్నరాష్ట్రాల వారికి కనిపిస్తుంది. అయితే భారత్‌లో దీని ప్రభావవం దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు ఉండబోతోంది. అయితే ఇంతకముందు ఖగోళ సంఘటన గత ఏడాది మే-జూన్‌లో కూడా జరిగింది. కానీ దీని ప్రభావవం భారత్‌పై కనిపించలేదు.
సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించే అవకాశాలు:
ఈ చంద్ర గ్రహణం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6.19 వరకు కొనసాగుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దాదాపు గంటన్నర నిడివి గల ఈ గ్రహణాన్ని భారతదేశంలో కూడా చూడవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. భారతదేశం కాకుండా, ఉత్తర, దక్షిణ అమెరికాలో కూడా దీని ప్రభావవం తీవ్రంగా ఉండబోతోంది.
రెండు చంద్ర గ్రహణాల ప్రభావం:
15 రోజుల్లో రెండు గ్రహణాలు వచ్చాయి కాబట్టి దీని ప్రభావవం ప్రపంచ వ్యాప్తంగా పడే అవకాశాలున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణంలో ఆకస్మిక మార్పు రావొచ్చని జ్యోతిష్యు నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రెండు గ్రహణాల ప్రభావవం దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారీ తీసే అవకాశాలు కూడా ఉన్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఏది ఏమైన గానీ భయానక వాతావరణాలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
మత విశ్వాసాల ప్రకారం.. గ్రహణం అనేది మన జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ఒక అశుభకరమైన సంఘటన. కాబట్టి ఈ గ్రహణాల వల్ల వచ్చే ప్రభావాలను అననుకూల మార్చుకుని పలు రకాల చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి దీని కోసం ముందుగానే ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ గ్రహణం క్రమంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదు. అంతేకాకుండా గ్రహణం సమయం తర్వాత ఇంటి తప్పకుండా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చంద్ర గ్రహణం సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది కాదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా గంగాజలంతో స్నానం చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి