Ketu Gochar 2023: జూలై 08 వరకు చిత్రా నక్షత్రంలోనే కేతువు.. ఈ 4 రాశులకు ఊహించనంత ధనలాభం..

Ketu transit 2023: ఆస్ట్రాలజీలో కేతు గ్రహాన్ని దుష్ట గ్రహం, పాప గ్రహం అని పిలుస్తారు. ఛాయా గ్రహమైన కేతువు చిత్రా నక్షత్రంలో మరో వారం రోజులపాటు ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2023, 04:02 PM IST
Ketu Gochar 2023: జూలై 08 వరకు చిత్రా నక్షత్రంలోనే కేతువు.. ఈ 4 రాశులకు ఊహించనంత ధనలాభం..

Ketu Gochar 2023 effect: ఇటీవల కేతు గ్రహం చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించింది. అదే నక్షత్రంలో జూలై 08 వరకు ఉంటాడు. ఆస్ట్రాలజీలో కేతు గ్రహాన్ని పాప గ్రహం అని పిలుస్తారు. ఎవరి జాతకంలో కేతువు బలహీన స్థితిలో ఉంటాడో వారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. అప్పుడప్పుడు కేతు సంచారం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. వీరి అనుగ్రహం ఉన్నవారికి దేనికీ లోటు ఉండదు. కేతు నక్షత్రం రాశి మార్పు ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం. 

కేతు సంచారం ఈ రాశులకు వరం
తుల రాశి
కేతువు నక్షత్ర రాశి మార్పు తులరాశి వారికి మేలు చేస్తుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆఫీసులో ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. సృజనాత్మక పనులతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. 
వృశ్చిక రాశి
కేతు సంచారం  వృశ్చిక రాశి వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. మీ ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి త్వరలో మీకు మంచి లాభాలను ఇస్తాయి. మీరు కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. బిజినెస్ చేసేవారికి బాగుంటుంది.
మేషరాశి
కేతువు రాశి మార్పు మేష రాశి వారు లాభాలను ఇస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీకు కోరుకున్నది లభిస్తుంది. మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళతారు. 

Also Read: Shani Margi 2023: శని ప్రత్యక్ష సంచారంతో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీరున్నారా?

వృషభరాశి
వృషభ రాశి వారికి కేతువు సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీ లైఫ్ లో చాలా మార్పులు వస్తాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో బాగుంటుంది. 

Also Read: Mercury transit 2023: కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న బుధుడు.. ఈ 5 రాశులకు కలిసి రానున్న కాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News