Kanuma 2024 Dates: దేశవ్యాప్తంగా సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. తెలుగు రాష్ట్ర ప్రజలు భోగి కనుమ మకర సంక్రాంతి పండగలను ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండగ రైతులు ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. రైతులకు కనుమ పండుగకు ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. వ్యవసాయానికి రైతులకు ఎంతగానో సహకరించే పశువుల కోసం ప్రతి సంవత్సరం కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ పండగలో భాగంగా పశువులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.. ప్రతి రైతుకు వారి వ్యవసాయానికి సహకరించే పశువులే ధనం. అవి ఎంతో కష్టపడి పని చేయడం వల్లే పండిన పంట చేతికి వస్తుంది.
అందుకే రైతులంతా ఈరోజు పశువులను అందంగా అలంకరించి.. వాటికి బియ్యంతో తయారుచేసిన పొంగలిని వండి పెట్టుతారు. కొంతమంది అయితే ఈ పండగ రోజు పశువుల కొమ్ములకు రంగులు వేసి రోజంతా వాటికి ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. పంటల దిగుబడి రావడానికి ప్రధాన కారణమైన పశువులను ఈరోజు దేవుడిలా కొలుస్తారు.
ఈ కనుమ పండగ అనేది పాడి పశువులకు ఒక కృతజ్ఞత తెలిపే పర్వం. కనుమ పండగ రోజు రైతులంతా మినుములతో తయారుచేసిన ఆహార పదార్థాలను పిండివంటలను ఎక్కువగా తింటూ ఉంటారు ఇలా తినడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు పిండివంటల్లో భాగంగా గారెలు, ఆవడలు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొందరు రైతులు ఈరోజు మాంసాహారాన్ని కూడా వండుకుంటారు.
సంక్రాంతి, కనుమ పండగలతో పల్లెలన్నీ ఎంతో సందడిగా మారుతాయి. ఈ రెండు రోజులపాటు పండగకు ఇంటికి వచ్చిన బంధువులు కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కోడిపందెల సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఈ పందెంలలో పోటీ చేసేందుకు రాష్ట్ర ప్రజలు తరలివస్తారు. ముఖ్యంగా ఈ పండగకు పండించిన పంటలు చేతికి రావడంతో రైతులు ఎంతో ఆనందంగా ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter