Jupiter Transit 2023 To 2024: ఈ రాశి వారిపై బృహస్పతి ప్రభావం..ఈ రోజు నుంచి అదృష్టం వరించబోతోంది!

Jupiter Transit 2023 To 2024: బృహస్పతి సంచారం కారణంగా మేష రాశితో పాటు కొన్ని రాశుల వారి ప్రేమ జీవితాల్లో అనేక మార్పులు రాబోతున్నాయి. దీంతోపాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ బృహస్పతి ప్రభావం ఏయే రాశుల వారిపై పడుతుందో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2023, 10:09 AM IST
Jupiter Transit 2023 To 2024: ఈ రాశి వారిపై బృహస్పతి ప్రభావం..ఈ రోజు నుంచి అదృష్టం వరించబోతోంది!

Jupiter Transit Effects: గ్రహస్థానాల మార్పులు అన్ని రాశి చక్రాలను ప్రభావితం చేస్తాయి. గ్రహ సంచారం వ్యక్తుల జాతకాల్లో శుభస్థానంలో జరిగితే వ్యక్తిగత జీవితాల్లో అదృష్టం పెరగవచ్చు..గ్రహల సంచారం అశుభ స్థానంలో జరిగితే అనేక రకాల సమస్యలు వస్తాయి. ఈ సంవత్సరం చివరి వారంలో అనేక గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటూ రాశి సంచారం చేయబోతున్నాయి. డిసెంబర్ 31వ తేదీన గృహస్పతి ఒక రాశిని వదిలి మరో రాశులోకి  సంచారం చేయబోతోంది. దీని కారణంగా మూడు సంవత్సరాల క్రితం జన్మించిన వారికి చదువు పరంగా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఇతర లాభాలు కూడా కలుగుతాయి.

ఈ బృహస్పతి సంచారం కారణంగా మేష రాశితో పాటు మరో మూడు రాశుల జీవితాలపై శుభ ప్రభావాన్ని చూపబోతోంది. ఈ గ్రహాల ప్రభావం కారణంగా ఆ రాశుల వారికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  అంతేకాకుండా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.

ధనస్సు రాశి:
గృహస్పతి సంచారం కారణంగా ధనస్సు రాశికి ఎంతో మేలు జరగబోతోంది. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి 2024 సంవత్సరంలో ప్రేమ వివాహాలు కూడా జరగవచ్చు. దీంతోపాటు అనేక మార్పుల కారణంగా భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇప్పటికీ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న వారికి ఈ సంచారం కారణంగా జీవిత భాగస్వామి కూడా పొందుతారు.

Also read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా

సింహరాశి:
ఈ గృహస్పతి సంచారం కారణంగా డిసెంబరు 31వ తేదీ నుంచి సింహ రాశి వారి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. వీరికి ఈ సమయంలో అదృష్టం వెంటే ఉంటుంది. వ్యాపారాలు లేదా వృత్తిపరమైన పనుల కోసం ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరిగి ఆస్తులుగా మారుతాయి.

మేష రాశి:
మేష రాశి వారికి కూడా 2024 సంవత్సరంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ బృహస్పతి సంచారం కారణంగా కుటుంబంతో ఎంతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ, వైవాహిక జీవితంలో అనేక మార్పులు జరిగి జీవిత భాగస్వామితో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఇంతకుముందున్న సమస్యలన్నీ దూరమవుతాయి.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News