Guru Gochar 2023: గురుడు సంచారంతో ఈ 5 రాశులకు నరకం.. ఇందులో మీరున్నారా?

Jupiter transit 2023: ఏప్రిల్ 22న దేవగురు బృహస్పతి మేషరాశిలో సంచరించనున్నాడు. గురుడు సంచారం వల్ల ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 05:13 PM IST
Guru Gochar 2023: గురుడు సంచారంతో ఈ 5 రాశులకు నరకం.. ఇందులో మీరున్నారా?

Guru Gochar 2023: మరో నాలుగు రోజుల్లో అంటే ఏప్రిల్ 22న గురుడు తన రాశిని మార్చబోతున్నాడు. మేషరాశిలో బృహస్పతి ఉదయం 06.12 గంటలకు సంచరించనున్నాడు. ఇదే సమయంలో సూర్యుడు, బుధుడు మరియు రాహువుతో గురువు చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరచున్నాడు. ఇదే సమయంలో రాహువుతో గురుడు చండాల యోగాన్ని సృష్టించనున్నాడు. ఈ యోగం అక్టోబరు 30 వరకు ఉంటుంది. గురు గ్రహం మే 01, 2024 వరకు మేషరాశిలోనే  ఉంటాడు. ప్రస్తుతం దేవగురు అస్తమయంలో ఉన్నాడు. ఏప్రిల్ 27న బృహస్పతి మేషరాశిలో ఉదయిస్తాడు. బృహస్పతి సంచారం వల్ల ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 

కన్య
కన్య రాశి వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. బృహస్పతి సంచారం వల్ల మీ పురోగతి ఆగిపోతుంది. వైవాహిక జీవితంలో గొడవలు రావచ్చు. మీ జీవిత భాగస్వామితో మంచిగా ప్రవర్తించండి. 
మకరం
మకర రాశి వారికి కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం అస్సలు కలిసిరాదు. 
మేషం
బృహస్పతి సంచారం వల్ల మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిలో విజయం సాధించడం వల్ల కష్టంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో కోపం తెచ్చుకోవడం మానుకోండి. వ్యాపారులు నష్టపోతారు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. 

Also Read: Rahu Ketu Gochar 2023: వచ్చే 6 నెలలు ఈ రాశుల జీవితం అల్లకల్లోలం.. ఇందులో మీరున్నారా?

వృషభం
వృషభ రాశి వారికి గురు సంచారం వల్ల ధన నష్టం కలుగుతుంది. ఈ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వద్దు. పోటీ పరీక్షల్లో విజయం సాధించడం మీకు కష్టంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో మీరు ఇరుక్కునే అవకాశం ఉంది. 
కర్కాటకం
బృహస్పతి సంచారం వల్ల మీరు కెరీర్ లో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు చెడిపోయే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 

Also Read: Jupiter Rise 2023: ఏప్రిల్ 27న ఉదయించబోతున్న గురుడు.. ఈ 6 రాశులపై డబ్బు వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Also Read: Chaturgrahi Yog: మరో నాలుగు రోజుల్లో 'చతుర్గ్రాహి యోగం'.. ఈ రాశుల ఫేట్ మారడం ఖాయం.. 

Trending News