Jupiter Transit 2023: బృహస్పతి గ్రహ సంచారంతో 2024లో ఈ రాశులవారికి 100 శాతం ఇదే జరగబోతోందా?

Jupiter Transit 2023: బృహస్పతి గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా రాబోయే కొత్త సంవత్సరంలో వ్యాపారాల్లో కూడా చాలా రకాల మార్పులు వస్తాయి. అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 06:04 PM IST
Jupiter Transit 2023: బృహస్పతి గ్రహ సంచారంతో 2024లో ఈ రాశులవారికి 100 శాతం ఇదే జరగబోతోందా?

 

Jupiter Transit 2023: 2023 సంవత్సరం చివరి నెలలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అన్ని గ్రహాలు నిర్దిష్ట విరామం తర్వాత రాశి సంచారం చేస్తాయి. డిసెంబర్ 29న బృహస్పతి నేరుగా మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో ఆనందం, సంపద, శ్రేయస్సు, వైవాహిక జీవితంలో ఆనందానికి సూచికగా పరిగణిస్తారు. బృహస్పతి గ్రహం రాశి సంచారం చేయడం కారణంగా వ్యక్తి జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి. బృహస్పతి ప్రత్యక్ష సంచారం చేయడం కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సంచారం 4 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం చూపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు అయితే..మరికొన్ని రాశులవారికి ఉద్యోగ-వ్యాపారాలలో అడ్డంకులు ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
కర్కాటక రాశి:

బృహస్పతి గ్రహం రాశి సంచారం చేయడం వల్ల కెరీర్‌లో ఆశించిన విజయాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు భూమి, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వ్యాపారాలు చేసేవారికి ఆర్థికంగా ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి ఆఫీస్సుల్లో అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అంతేకాకుండా మంచి పేరు కూడా పొందే ఛాన్స్‌లు ఉన్నాయి.

సింహ రాశి:
బృహస్పతి సంచారం సింహరాశివారికి చాలా లాభదాయకంగా ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి. కెరీర్‌లో ఎదుగుదలకు ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సంపాదనలో పెరుగుదల కూడా రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు చేసేవారి ప్రమోషన్స్‌ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

కన్యా రాశి:
బృహస్పతి 2024 ప్రత్యక్షంగా సంచారం చేయడం వల్ల కన్యా రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇతక ముందు పెట్టిన పెట్టుబడుల కారణంగా ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. దీంతో పాటు వీరు విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇంట్లో ఆనంద వాతావరణం కూడా పెరుగుతుంది.  పనుల్లో ఆటంకాలు తొలగిపోయి..ఆకస్మిక ధనలాభాలు పెరుగుతాయి. 

మీన రాశి:
2024 సంవత్సరంలో మీన రాశి వారి సంపదలో భారీ పెరుగుదల ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాభివృద్ధిలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైవాహిక జీవితంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఆదాయ వనరులు కూడా ఊహించని స్థాయిల్లో పెరుగుతాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News