Jupiter Set 2023: మార్చ్ 28వ తేదీన గురుడు అస్తమం.. ఈ రాశులకు ఊహించని లాభాలు

Jupiter Set 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురుడికి విశేష స్థానం, ప్రాధాన్యత ఉన్నాయి. గురుడిని జ్ఞానం, శిక్షణ, సంతానం, ఆధ్యాత్మికం, ధనం, పుణ్యాలకు ప్రతీతిగా భావిస్తారు. అందుకే గురుగ్రహం అస్తమించినా, ఉదయించినా వివిధ రాశులపై ప్రభావం ఉంటుంది..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2023, 08:50 AM IST
Jupiter Set 2023: మార్చ్ 28వ తేదీన గురుడు అస్తమం.. ఈ రాశులకు ఊహించని లాభాలు

Jupiter Set @ March 28 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం దేవగురువుగా భావించే గురు గ్రహాని విశేష మహత్యముంది. గ్రహాలు ఎప్పుడు గోచారం చేసినా లేదా ఉదయించడం, అస్తమించడం జరిగినా అ ప్రభావం అన్ని రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంటుంది. మార్చ్ 28వ తేదీన గురుడు అస్తమించనున్నాడు. గురుడి అస్తమించడంతో పెళ్లి మొదలుకుని అన్ని శుభకార్యాలు ఆగిపోతాయి. గురుడు అస్తమించినా కొన్ని రాశులపై మాత్రం అనుకూల ప్రభావం పడనుంది. గురుడి అస్తమించడం ప్రభావంతో కొన్ని రాశులకు దశ తిరిగిపోనుంది. 

మేష రాశి:

జ్యోతిష్యం ప్రకారం గురుడు అస్తమించడం వల్ల మేష రాశి జాతకుల జీవితంలో ప్రత్యేకత కన్పిస్తుంది. ఈ సమయంలో అంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ జాతకులకు పనుల్లో విజయం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. ఫలితంగా వ్యక్తి ఆర్ధిక పరిస్థితి పటిష్టమౌతుంది. దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది. మేష రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం తోడవుతుంది. జీవితం ఆనందంగా ఉంటుంది.

తులా రాశి:

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తులా రాశి జాతకులకు ఈ సమయం చాలా వరదాయకంగా భావించాలి. ఎందుకంటే ఊహించని లాభాలు కలుగుతాయి. వ్యక్తి ఉద్యోగం, వ్యాపారంలో బాగా అభివృద్ధి సాధిస్తాడు. జీవిత భాగస్వామితో సమయం గడుపుతాడు. ఇతరుల సహకారం లభిస్తుంది. 

కర్కాటక రాశి:

ఈ సమయం కర్కాటక రాశి వారికి బాగుంటుంది. అత్యంత అనుకూలంగా ఉండవచ్చు.ఈ జాతకులకు మానసిక శాంతి లభిస్తుంది. ఆర్ధిక సమస్యల్నించి విముక్తి లభిస్తుంది. దాంతోపాటు పనిలో విజయం ఉంటుంది. ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబసభ్యులతో సమయం గడిపేందుకు అవకాశం లభిస్తుంది.

మీన రాశి:

మీన రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండనుంది. ఈ సమయంలో ఈ జాతకం వారికి పూర్తి సహకారం లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండనుంది. ఆధ్యాత్మిక పనుల్లో భాగస్వామ్యం ఉంటుంది. చేసే పనుల్లో విజయం లభిస్తుంది.

కుంభ రాశి:

జ్యోతిష్యం ప్రకారం కుంభ రాశి జాతకులకు ఈ సమయం అత్యంత సానుకూలంగా ఉంటుంది. ఈ సందర్భంగా ప్రతి రంగంలో విజయం లభిస్తుంది. ఈ సమయంలో వ్యక్తి ఏ పనిచేసినా అందులో లాభం కలుగుతుంది. శివుడి కటాక్షం లభిస్తుంది. అంతేకాకుండా..ఉద్యోగ, వ్యాపారాలకు మంచి సమయం. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది.

Also Read: Mercury Jupiter Transit 2023: రేవతీ నక్షత్రంలో గురు, బుధ గ్రహాల యుతి, ఆ 5 రాశులకు తిరగనున్న దశ

Also Read: Rolls Royce Cullinan Black Badge: షారుఖ్ వద్ద ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నాయో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News