Jupiter Rise 2023: హంస రాజయోగం చేయబోతున్న బృహస్పతి.. ఈ రాశులను వరించనున్న అదృష్టం..

Jupiter Rise 2023: త్వరలో బృహస్పతి అరుదైన యోగాన్ని చేయబోతున్నాడు. దీని కారణంగా కొందరికి అదృష్టం పట్టనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 04:21 PM IST
Jupiter Rise 2023:  హంస రాజయోగం చేయబోతున్న బృహస్పతి.. ఈ రాశులను వరించనున్న అదృష్టం..

Jupiter Rise 2023: గ్రహాలు నిర్ణీత సమయంలో తమ రాశులను ఛేంజ్ చేస్తాయి. ఈ గ్రహాల గమనంలో మార్పు మానవ జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిషశాస్త్రంలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. త్వరలో గురుడు ఉదయించబోతున్నాడు. దీని కారణంగా అరుదైన హంస రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.  ఈ రేర్ రాజయోగం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఆ లక్కీ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 

హంస రాజయోగం ఈ రాశులకు వరం

కర్కాటకం (Cancer): బృహస్పతి ఉదయించడం వల్ల కర్కాటక రాశి వారు వృత్తి, వ్యాపారాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. చేసే పనులన్నింటిలో విజయం దక్కుతుంది. చిరకాల కోరికలు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉంది.
ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశి వారికి గురుగ్రహం చాలా మేలు చేస్తుంది. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది అనుకూల సమయం. ఈ సమయంలో మీరు వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా మీ పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.  
మీనం (Pisces): హంస రాజయోగం మీనరాశి వారికి మంచి ఫలితాలనిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Trigrahi Yog: మూడు దశాబ్దాల తర్వాత కుంభంలో త్రిగ్రాహి యోగం.. ఈరాశులపై కనక వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News