Jupiter Ast 2023: గురుడి అస్తమయం ప్రభావం, మార్చ్ 28 తరువాత ఆ 6 రాశులకు నాశనం తప్పదా

Jupiter Ast 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గురు గ్రహాన్ని విద్య, పెళ్లి, సంతానం, ధనం, అదృష్ట కారకుడిగా భావిస్తారు. అందుకే ఈ గ్రహం కదలిక, గోచారం వంటి పరిణామాలు అన్ని రాశులపై తీవ్ర ప్రతికూల లేదా అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అలాంటి గురు గ్రహం అస్తమించనుంది. దీని ఫలితం ఎలా ఉంటుంది..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2023, 07:45 AM IST
Jupiter Ast 2023: గురుడి అస్తమయం ప్రభావం, మార్చ్ 28 తరువాత ఆ 6 రాశులకు నాశనం తప్పదా

Jupiter Ast 2023: జ్యోతిష్యం ప్రకారం దేవగురువుగా భావించే గురుడు మార్చ్ 28వ తేదీన మీనరాశిలో అస్తమించనున్నాడు. గురుడి అస్తమించడంతో 6 రాశులకు కొంప మునిగిపోతుంది. మీ అదృష్టం కూడా పోతుంది. ఈ ఆరు రాశుల్లో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి

గురు గ్రహం మీనరాశిలో అస్తమించడం వల్ల ఆ ఆరు రాశులకు నెలరోజులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇందులో మీ రాశి ఉందో లేదో పరిశీలించుకోండి. ఎందుకంటే ఏదైనా గ్రహం సూర్యునికి 11 కోశాలు లేదా అంతకంటే సమీపంలో వచ్చినప్పుడు ఆ గ్రహం ఆస్తమించిపోతుంది. ఆ గ్రహం తన శక్తి కోల్పోతుంది. ఫలితంగా అన్ని జీవాలపై ప్రభావం పడుతుంది. గురు గ్రహం అస్తమించడం కూడా అలాంటిదే. అశుభంగా పరిగణిస్తున్నారు. గురు గ్రహం అస్తమించడంతో నెగెటివ్ శక్తులు ప్రసరిస్తాయి. నిశ్చితార్ధం, పెళ్లి వంటి శుభ కార్యాలు జరపకూడదు. గురు గ్రహం మార్చ్ 28వ తేదీన మీన రాశిలో అస్తమించనున్నాడు. ఆ తరువాత ఏప్రిల్ 27న మేష రాశిలో ఉదయిస్తాడు. ఫలితంగా చాలా రాశుల జీవితాల్లో నెలవరకూ నెగెటివ్ పరిణామాలు కలుగుతాయి. ఆ ఆరు రాశులేంటో తెలుసుకుందాం..

మిధున రాశి

పనిచేసే చోట ప్రత్యర్ధులు మీపై ఓ అడుగు ముందుంటారు. మీ ప్రతిష్ట తగ్గించే పనిచేస్తారు. ఫలితంగా ఇంక్రిమెంట్లు లేదా పదోన్నతి ఆలస్యమౌతుంది. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవచ్చు. ప్రత్యేకించి భాగస్వామి వ్యాపారంలో సమస్యలు తలెత్తవచ్చు. పెళ్లి జీవితం కఠినంగా మారనుంది. జీవిత భాగస్వామితో విబేధాలు ఏర్పడవచ్చు.

కన్యా రాశి

గురు గ్రహం మీన రాశిలో అస్తమించడం వల్ల మీ జీవిత భాగస్వామి, తల్లి ఆరోగ్యం వికటించవచ్చు. ఇంట్లో వివాదాలు ఏర్పడవచ్చు. పెళ్లి జీవితం కాస్త కఠినంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విబేధాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇంట్లోనూ, బయట ఏ విధమైన గొడవలు పడకుండా దూరంగా ఉండండి. మీ ఖర్చులు పెరగవచ్చు. అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 

మకర రాశి

గురుడి ఆస్తమించడం వల్ల జీవిత భాగస్వామితో అనవసర వివాదం ఏర్పడుతుంది. ఫలితంగా మీ ఇద్దరి మధ్యం బంధం చెడిపోతుంది. మీ కంటే చిన్నవారైన సోదర, సోదరీమణులతో మీ సంబంధాలు చెడిపోవచ్చు. ఆర్ధిక అంశాల విషయంలో వాదన జరగవచ్చు. మీరు ఆత్మ విశ్వాసం కోల్పోవచ్చు. మానసిక ఒత్తిడికి లోనవుతారు. కోర్టు వ్యవహారాలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు.

మేష రాశి

గురుడు ఆస్తమించడం వల్ల మిశ్రమ ఫలితాలు ఎదురౌతాయి. అదృష్టం తోడుగా ఉండదు. కష్టాలెదురౌతాయి. కష్టపడితేనే ఫలితాలుంటాయి. మనస్సు విచలిస్తుంది. ఫలితంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది. తీర్ధ యాత్రలు, విదేశీ, లేదా సుదీర్ఘ ప్రయాణాలకు వెళ్లే ప్లానింగ్ చేస్తే వాటిని రద్దు చేసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి సంతానం తరపున సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పిల్లల వైఖరి, వ్యవహారంలో హఠాత్తుగా మార్పు రావచ్చు. మీ భావాల్ని వ్యక్తపర్చడంలో విఫలమౌతారు. కుటుంబంలో, కుటుంబ సభ్యులతో ఉండవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులు విఫలం కావచ్చు.

వృషభ రాశి

వృషభ రాశి జాతకుల్లో ఉన్నత చదువులు చదివే విద్యార్ధులు ముఖ్యంగా పీహెచ్ డి, సీక్రెట్ సైన్స్ లేదా రీసెర్చ్ విభాగంలో ఉండేవారికి సమస్యలు ఎదురుకావచ్చు. ఆర్ధిక లాభాలు లేదా పెట్టుబడులకు ఇది ఏ మాత్రం అనువైన సమయం కాదు. ఆదాయంతో పోలిస్తే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో గొడవలు ఏర్పడవచ్చు. గురుడి అస్తమించిన తరువాత ఇళ్లు లేదా వాహనాలు కొనుగోలు నుంచి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ వ్యవహారంలో తీవ్ర నష్టాలు రావచ్చు.

Also read: Mercury Transit 2023: బుధ గోచారం ఆ రాశివారికి ప్రమాదకరం, తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News