Jaya Ekadashi 2024: జయ ఏకాదశి రోజున అద్భుత పరిణామం.. ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..

Jaya Ekadashi 2024 date: మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి తేదీని జయ ఏకాదశి అంటారు. ఇది మరో రెండు రోజుల్లో రాబోతుంది. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2024, 05:05 PM IST
Jaya Ekadashi 2024: జయ ఏకాదశి రోజున అద్భుత పరిణామం.. ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..

Jaya Ekadashi 2024 effect on Zodiac Signs: మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి తేదీని జయ ఏకాదశి అంటారు. ఈరోజున విష్ణువును పూజించడం వల్ల మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ ఏడాది జయ ఏకాదశి ఫిబ్రవరి 20న రాబోతుంది. అంతేకాకుండా ఇదే రోజున ప్రీతి యోగం, అద్ర నక్షత్రం, ఆయుష్మాన్ యోగం వంటి యాదృచ్ఛికాలు జరగబోతున్నాయి. ఈ జయ యోగం 4 రాశులవారిపై సానుకూల ప్రభావం చూపనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేషం
జయ ఏకాదశి కారణంగా మేషరాశి వారు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా మీ సమస్యలన్నీ దూరమవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ వస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. 
తుల
ఉద్యోగ మరియు వ్యాపారులు లాభపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయాన్ని గడుపుతారు. మీ సామాజిక హోదా పెరుగుతుంది. 

Also Read: Astrology: మరి కొన్ని రోజుల్లో రాశి మారనున్న బుధుడు-శుక్రుడు.. ఇక ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే..!

వృషభం
ఈరాశి వారిపై విష్ణువు అనుగ్రహం ఉంటుంది. మీకు భారీ మెుత్తంలో డబ్బు మరియు పదవి లభించే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు ఉద్యోగం వస్తుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. 
సింహం
జయ ఏకాదశి సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారుల లాభాలు పొందడంతోపాటు బిజినెస్ ను విస్తరిస్తారు. జాబ్ ప్రదేశంలో మీకు సీనియర్ల మద్దతు లభిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Travel Tips: వైష్ణోదేవి ఆలయం సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? కానీ, ఇవి ఉంటేనే వెళ్లగలరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News