January 2024 Rasi Phalalu: డిసెంబరు చివరి వారంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొత్త సంవత్సరంలో మొదటి నెలలో ఈ గ్రహాల సంచారం ప్రభావం ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహాల సంచారం కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. డిసెంబర్ 16న సూర్య గ్రహం, అంగారకుడు డిసెంబర్ 27న ధనుస్సు రాశిలోకే సంచారం చేబోతున్నాయి. అయితే ఇదే రాశిలోకి త్వరలోనే కుజుడు కూడా సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ ప్రత్యేక యోగ ప్రభావం కొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు అవ్వబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఆదిత్య మంగళ రాజయోగం ఏయే రాశులవారిపై ప్రత్యేక ప్రభావం చూపబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ఆదిత్య మంగళ రాజయోగం ప్రభావం:
మేషరాశి:
మేషరాశి జాతకంలో ప్రత్యేక స్థానంలో ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ రాశివారికి రాబోయే కొత్త సంవత్సరం చాలా లాభదాయకంగా ఉండబోతోంది. కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి ఈ సమయంలో శుభవార్తలు అందుకుంటారు. అంతేకాకుండా అదృష్టం రెట్టింపు అవ్వడంతో ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ధనుస్సు రాశి:
ఏర్పడబోయే ఆదిత్య మంగళ రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారికి ధైర్యం పెరిగి ఇంతక ముందు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఇక కెరీర్ విషయానికొస్తే..ఈ ప్రత్యేక యోగం కారణంగా అనుకోని ఫలితాలు పొందుతారు. దీని కారణంగా వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు వస్తాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రశంసలు కూడా పొందుతారు.
సింహ రాశి:
సింహరాశి వారికి ఈ ఆదిత్య మంగళ రాజయోగం ఐదవ స్థానంలో ఏర్పడబోతోంది. దీని కారణంగా మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభించి యాక్టివ్‌గా తయారవుతారు. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు సులభంగా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి