Jagannath Rath Yatra 2023: దేశవ్యాప్తంగా పూరీ జగన్నాథ రథయాత్రకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ యాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి ప్రజలు తరలివస్తారు. ఈ జగన్నాథ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో ఉంది. ఇది హిందూ దేవాలయం. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రలు పూజలు అందుకుంటారు. జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. జీవితంలో కాలంలో ఒక్కసారైనా జగన్నాథుడిని దర్శించుకోవాలని ప్రజలు భావిస్తారు. ఈ పూరీ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడటం మరో ప్రత్యేకత. ఈ ఆలయ నిర్మాణాన్ని కళింగ పాలకుడు చోడగంగాదేవుడు ప్రారంభించగా.. అతని మనమడైన అనంగభీమదేవ్ కాలంలో పూర్తయింది.
ఈ సంవత్సరం రథయాత్ర ఎప్పుడు?
ఈ పూరీ జగన్నాథ రథయాత్ర ప్రతి ఏటా జూన్ లేదా జూలై మాసాల్లో వస్తుంది. ఈ సంవత్సరం ఈ రథయాత్ర జూన్ 20న జరుపుకోనున్నారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి 16 చక్రాలు ఉంటాయి. దాదాపు 4 వేల మంది భక్తులు ఈ రథాన్ని లాగుతారు. దీని కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాన్ని తయారు చేస్తారు. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు కొనసాగుతుంది. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అనీ, బలభద్రుడి రథాన్ని తాళధ్వజమనీ, సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అనీ పిలుస్తారు.
Also Read: Astrology: మరో 11 రోజుల్లో ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు.. ఇందులో మీ రాశి ఉందా?
ఎలా చేరుకోవాలి?
ఒడిశాలోని ఈ పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకోవడానికి విమాన, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమానాం ద్వారా వచ్చేవారు ముందుగా భువనేశ్వర్ లోని బిజూపట్నాయక్ ఎయిర్ పోర్టు కు చేరుకోవాలి. అక్కడ నుంచి పూరీ కేవలం 60 కిలోమీటర్లు మాత్రమే. భువనేశ్వర్, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యం ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు ఉన్నాయి.
Also Read: Chandra Grahan 2023: ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఎప్పుడు? ఇది ఇండియాలో కనిపిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
పూరీ జగన్నాథుని రథయాత్ర ఎప్పుడు? దాని హిస్టరీ, ప్రాముఖ్యత తెలుసుకోండి..