December 16 Horoscope: హేమంత ఋతువు.. ఆ రాశి వారి జీవితంలో పెను మార్పు.. తలుపు తట్టనున్న అదృష్టం

Horoscope Today, December 16, 2021: ప్లవ నామ సంవత్సరం..డిసెంబర్ 16, 2021 గురువారం రాహుకాలం మధ్యాహ్నం 1:34 – 2:56, యమగండం - ఉదయం 6:42 – 8:04.. ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2021, 09:31 PM IST
  • కర్కాటక రాశి వారు కాస్త ఆలోచించి ముందుకెళ్తే మంచిది
  • సింహ రాశి వారు ప్రత్యర్థుల ఎత్తుగడలపై దృష్టి పెట్టాలి
  • ఈ రోజు ఆ రాశి వారికి అంతా మేలే..
December 16 Horoscope: హేమంత ఋతువు.. ఆ రాశి వారి జీవితంలో పెను మార్పు.. తలుపు తట్టనున్న అదృష్టం

Horoscope Today 16 December 2021 Check rasi phalalu astrological prediction Tithi, Shubha Muhuratham, Rahu Kaalam and Other Details for Thursday: ప్లవ నామ సంవత్సరం..డిసెంబర్ 16, 2021 గురువారం రాశి ఫలాలు, తిథి నక్షత్రాలు ఈ విధంగా ఉన్నాయి. 
విక్రం సంవత్సరం - ఆనంద 2078, మార్గశిరము 12
పుర్నిమంతా - 2078, మార్గశిరము 27
అమాంత - 2078, మార్గశిరము 12
తిథి : శుక్లపక్షం త్రయోదశి - శుక్లపక్షం చతుర్దశి 
నక్షత్రం : కృతిక - ఉదయం 07:35 – డిసెంబర్ 17 ఉదయం 10:40 వరకు

సూర్య, చంద్ర సమయం
సూర్యోదయము - ఉదయం 6:42
సూర్యాస్తమానము - సాయంత్రం 5:40 
చంద్రోదయం - డిసెంబర్ 16 సాయంత్ర 3:41 
చంద్రాస్తమయం - డిసెంబర్ 17 సాయంత్రం 4:56 

అనుకూలమైన సమయం
రాహు - మధ్యాహ్నం 1:34 – 2:56 
యమగండం - ఉదయం 6:42 – 8:04 
గుళికా - ఉదయం 9:27 – 10:49 
దుర్ముహూర్తం - ఉదయం 10:22 – 11:05, మధ్యాహ్నం 02:45 – 03:28
వర్జ్యం - రాత్రి 09:08 – 10:56

శుభ సమయం
అభిజిత్ ముహుర్తాలు - ఉదయం 11:49 – మధ్యాహ్నం 12:33
బ్రహ్మ ముహూర్తం - ఉదయం 05:06 – ఉదయం 05:54 వరకు.

ఇక వివిధ రాశుల ప్రకారం వారి రాశి ఫలాలు, దినఫలాలు ఈ విధంగా ఉండనున్నాయి. ఈ రోజు ఒక్కసారిగా ఆ రాశి వారి జీవితంలో పెను మార్పు వస్తుంది. అదృష్ట లక్ష్మి వారి తలుపును తడుతుంది. ఇక మరో రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది. వృత్తిపరంగా కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇంకో రాశి వారు డబ్బు ఆదా చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆర్థిక విషయాల్లో, ఇతర విషయాలలో మీ రాశి ప్రకారం మీకు జరిగే శుభాలు, అశుభాలు ఏమిటో ఒకసారి చూడండి.

మేషరాశి (Aries)

ఈరోజు మీరు ఏదైతే జరుగుతుందని ఊహిస్తారో అది జరగదు. మీరు ఈ రోజు ఎక్కడైనా వెళ్లాలి అనుకుంటున్నట్లయితే అక్కడికి వెళ్లడం మంచిది. దీంతో మీకు మేలు జరుగుతుంది. లాభం చేకూరే అవకాశం ఉంది. అయితే ఎవరికీ కూడా హామీలు ఇవ్వకండి. ఈ రోజు డబ్బుపరంగా మీకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరవు. 

వృషభం (Taurus)

ఈ రోజు మీపై కొంత అదనపు పనిభారం పడే అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగస్తులు అయితే మీకు కొన్ని కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఇక ఇంటి విషయానికి వస్తే ఇంట్లో కూడా మీకు కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఈరోజు కొన్ని వస్తువులను కొనే అవకాశం ఉంది. 

మిథునం: (Gemini)

మీరు ఈరోజు కొన్ని బాధ్యతాయుతమైన పనులను పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారికి.. ప్రయాణం చేసే సమయంలో అకస్మాత్తుగా వారికి నచ్చిన వ్యక్తి కనపడే అవకాశం ఉంటుంది. అయితే వారి కోసం మీరు వెంటనే కొన్ని సహాయాలు కూడా చేయాల్సి రావొచ్చు. ఇవాళ మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో మంచి లబ్ది పొందుతారు. 

కర్కాటకం: (Cancer)

కర్కాటక రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల్లో పెద్ద తప్పులు చేసే అవకాశం ఉంటుంది. దీంతో మీరు భవిష్యత్తులో ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అందువల్ల ఏదైనా చేసే ముందు కాస్త బాగా ఆలోచించి ముందడుగు వేయండి. ఇతరులకు మంచి చేసే విషయాల్లో కూడా కర్కాటక రాశి కాస్త ఆలోచించి ముందుకెళ్తే మంచిది. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కొన్ని విషయాల్లో అదృష్టం కూడా కలిసి వస్తుంది. 

సింహం: (Leo)

సింహ రాశి వారు ఈ రోజు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాస్త నిశితంగా గమనిస్తూ ఉండే మంచింది. మీ చుట్టూ ఏమి జరుగుతుందో మీరు ఓ కన్నేసి ఉంచండి. వ్యాపారంలో మీ ప్రత్యర్థుల దృష్టి అంతా కూడా మీపైనే ఉంటుంది. దీంతో ఈ రోజు సింహరాశి వారు.. ప్రత్యర్థుల అన్ని కార్యకలాపాలపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.

కన్య: (Virgo)

కన్యరాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మీపై కొందరు ఎంతో ప్రేమ చూపుతూ.. మీ దగ్గరకు వస్తారు. అయితే అలాంటి వారి విషయంలో కన్యరాశి వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అలాంటి వారు మీ నుంచి ఆర్థికంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. కన్యరాశి వారు ఈ రోజు ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు పొందుతారు. అలాగే కన్యరాశి వారు కొన్ని శుభవార్తలు కూడా వింటారు.

Also Read : RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్- వేడుక ఎప్పుడంటే?
తుల: (Libra)
తుల రాశి వారు వారి ప్రేమికుల విషయంలో, పార్ట్‌నర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ రోజు మీ భాగస్వామి ద్వారా కొన్ని గందరగోళ పరిస్థితులు తలెత్తవచ్చు. అలాంటి సందర్భం తలెత్తితే మీరు మౌనంగా ఉండడం మంచిది. లేదంటే మీ బాంధవ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు తులరాశి వారు కెరీర్ పరంగా మంచి అదృష్టాన్ని పొందుతారు.

వృశ్చికం: (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొన్ని విషయాల్లో మంచి జరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు.. మీ సన్నిహితుల సహాయం తీసుకుని ముందుకెళ్లండి. దీంతో మీరు విజయపథంగా జీవితంలో ముందుకు దూసుకెళ్తారు. 

ధనస్సు రాశి: (Sagittarius)

ధనస్సు రాశి వారు.. ఈరోజు కొన్ని పనులు పూర్తి చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయాలు తీసుకుంటే మంచింది. లేదంటే మీకు దక్కాల్సినవి ఇతరులకు దక్కే అవకాశం ఉంది. అందువల్ల ఈ రోజు ధనస్సురాశి వారు చేపట్టే కార్యక్రమాల్లో వేగం పెంచాల్సి ఉంటుంది.

మకరం: (Capricorn)

మకర రాశి వారికి ఎన్నో రోజులుగా నెరవేరని కోరికలు కొన్ని ఇవాళ నేరవేరే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఆలయంలో మొక్కులు చెల్లించాల్సి ఉంటే వాటిని త్వరగా చెల్లించండి. ఈరోజు మకరరాశి వారు ఇంట్లో అలాగే ఆఫీసులో కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

కుంభం: (Aquarius)

కుంభరాశి వారు జీవితంలో ఈ రోజు ఒక్కసారిగా పెను మార్పు వస్తుంది. చాలా కాలం తర్వాత మీ రొటీన్ లైఫ్‌లో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఈ రోజు అదృష్ట లక్ష్మి మీ తలుపును తడుతుంది. మీకు కొత్తగా వచ్చే అవకాశాన్ని అస్సలు వదుకోకండి. దాంతో మీ జీవితం మలుపు తిరుగుతుంది.

మీనం: (Pisces)

ఈరోజు మీనరాశి వారు కొన్ని వేడుకలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే మీటింగ్‌లకు కూడా హాజరుకావాల్సి ఉంటుంది. మీ విషయంలో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే మౌనంగా ఉండడం మీకు మేలు. అలాగే మీనరాశి వారు డబ్బును పొదుపు చేసే విషయంలో కాస్త దృష్టి సారించాలి.

Also Read : సౌరవ్ గంగూలీ మంచి బ్యాటర్, కెప్టెన్ మాత్రమే కాదు.. అంతకుమించి అబద్ధాలకోరు కూడా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News