Horoscope Today: నేటి రాశిఫలాలు... ఈ రాశివారు కొత్త వస్తువులు కొంటారు..

Horoscope Today:  ఈరోజు కొన్ని రాశులవారికి శుభ సమయం నడుస్తుంటే... మరి కొందరికి మిశ్రమ కాలం నడుస్తోంది. నవంబరు 10న రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2022, 08:11 AM IST
Horoscope Today: నేటి రాశిఫలాలు... ఈ రాశివారు కొత్త వస్తువులు కొంటారు..

Horoscope Today:  మనం ఏదైనా శుభకార్యం చేయాలన్నా, కొత్త పని మెుదలుపెట్టాలన్నా, బయటకు వెళ్లాలన్నా ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూస్తాం. మరి ఈ రోజు మీ దినఫలాలు (horoscope on 10th november 2022) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

మేష రాశి (Aries): ఈ రాశివారు ఖర్చు ఎక్కువగా చేస్తారు. ఈ సమయంలో అధికారులతో జాగ్రత్తగా ఉండండి. మెుత్తానికి ఈ సమయం అంతగా కలిసిరాదు.
వృషభ రాశి (Taurus): ఈరోజు ఏం కార్యం తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. ఆర్ధిక వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. 
మిధున రాశి (Gemini): కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. మీరు ఏ పనితలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అందరినీ కలుపుకుని వెళ్లడం వల్ల మీకు సమస్యలు రావు. 
కర్కాటక రాశి (Cancer): ఈ రాశివారు ఈరోజు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆత్మీయుల సలహాతో ముందుకు వెళ్లండి. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
సింహ రాశి (Leo): పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 
కన్య రాశి (Virgo): మీరు అనుకున్నవి సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. పెద్దల సహకారం ఉంటుంది. 
వృశ్చిక రాశి (Scorpio): ప్రస్తుతం మీకు మిశ్రమకాలం నడుస్తోంది. బంధు మిత్రులతో హాయిగా గడుపుతారు. మీరు మంచి  ఫలితాలు సాధిస్తారు. 

ధనస్సు రాశి (Sagittarius): ఫ్యామిలీ సపోర్టుతో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులను సక్రమంగా పూర్తిచేస్తారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. 
మకర రాశి (Capricorn): ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల విషయంతో తగిన సహకారం లభిస్తుంది. బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి. మీ బాధ్యతలను నెరవేర్చుందుకు కృషి చేస్తారు. 
కుంభ రాశి (Aquarius): మీరు అనుకున్న ఫలితాలు సాధించాలంటే  చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. కొందరి ప్రవర్తన మీకు బాధను కలిగించే అవకాశం ఉంది. 
మీన రాశి (Pisces): ఈరోజు మీరు శుభవార్తను వినే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Also Read: Tulsi plant Tips: తులసి మొక్క మీ ఇంట్లో ఉందా..అయితే ఈ సూచనలు పాటించాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x