Horoscope 2022 February 26: నేటి రాశిఫలాలు.. ఇష్టదైవాన్ని వేడుకుంటే మరిన్ని శుభ ఫలితాలు

Horoscope 2022 February  26: నేడు 2022 ఫిబ్రవరి 26 (శనివారం). ఈ రోజు కొన్ని రాశులవారికి అనుకూల సమయం నడుస్తోంది. మరికొన్ని రాశులవారికి మిశ్రమ కాలం నడుస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 07:41 AM IST
Horoscope 2022 February 26: నేటి రాశిఫలాలు.. ఇష్టదైవాన్ని వేడుకుంటే  మరిన్ని శుభ ఫలితాలు

Horoscope 2022 February  26: సాధారణంగా మనం ఏ పని మెుదలపెట్టాలన్నా, శుభకార్యం చేయాలన్న ఆ రోజు దినఫలాలు ఎలా ఉన్నాయోనని చూస్తాం. మరి నేటి (శనివారం) రాశిఫలాలు (Today Horoscope) ఎలా ఉన్నాయో  చూద్దాం. 

మేషం ( Aries): ఈ రాశివారు ఏ పని మెుదలుపెట్టినా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా మెలగాలి. సమయానికి తింటూ నిద్రపోవాలి. 

వృషభం  (Taurus): ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమకాలం నడుస్తోంది. మంచి ఆలోచనలతో చేసే పనులు త్వరగా నెరువేరుతాయి. ట్రాన్స్ ఫర్స్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్లప్పుడూ మానసిక ప్రశాంతతో ఉండాలి. 

మిథునం (Gemini): ఈ రాశివారు ఏ పని ప్రారంభించిన మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ది కోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్న సక్సెస్ అవుతారు.  

కర్కాటకం (Cancer) : ఈ రోజు ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది. సమాజంలో వీరి కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన సహాయం లభిస్తోంది. ప్రయాణాలలో అలర్ట్ గా ఉండాలి.  ఏదైనా సంఘటన బాధ కలిగించవచ్చు. 

సింహం (Leo): ఈ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారంలో అధికారుల దృష్టి వీరిపై పడుతోంది.  ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను అందుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

కన్య (Virgo): అనుకున్న పని జరగాలంటే వీరు కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటుకు గురవుతారు. మెుదలుపెట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేస్తారు. 

తుల (Libra): గతంలో పూర్తికాని ఒక వ్యవహారం ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవాన్ని వేడుకుంటే  మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం (Scorpio): ఈ రాశివారు వారి వారి రంగాల్లో విశేష ఫలితాలను సాధిస్తారు. ఒక శుభవార్త వీరి మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు అధికమవుతాయి. 

ధనస్సు (Sagittarius) : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తమ మేధస్సుతో  కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. 

మకరం (Capricorn) : శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వీరికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. 

కుంభం (Aquarius): ఈ రోజు ఈ రాశివారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. తమకిష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు నెరవేరుతాయి. వీరికి సహనం అవసరం. కొన్ని పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. 

మీనం (Pisces) : ఈ రాశివారికి అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు వీరికి అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. శ్రమ అధికమవ్వకుండా చూసుకోవాలి. 

Also Read: Lucky Fathers: ఆ 3 రాశుల అమ్మాయిలతో వారి తండ్రులకు ఎనలేని అదృష్టం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News