Horoscope On December 2: ఈ రాశివారికి కల్యాణ యోగం మరియు శుభకాలం...

Horoscope today: గ్రహాల కదలికలు, రాశులపై ఆ గ్రహాల ప్రభావం మనిషి జాతకాన్ని ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుందంటారు. అదే సమయంలో ప్రతి ఒక్కరికీ ఇవాళ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది. ఈ నేపధ్యంలో ఇవాళ మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 2, 2021, 08:22 AM IST
Horoscope On December 2: ఈ రాశివారికి కల్యాణ యోగం మరియు శుభకాలం...

Horoscope today: గ్రహాల కదలికలు, రాశులపై ఆ గ్రహాల ప్రభావం మనిషి జాతకాన్ని ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుందంటారు. అదే సమయంలో ప్రతి ఒక్కరికీ ఇవాళ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది. ఈ నేపధ్యంలో ఇవాళ మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి (Aries): ఈ రాశివారికి పూర్తిగా అనుకూలమైన రోజు. మీరు అనుకున్న పనులన్న నెరవేరుతాయి. ఆర్ధికాభివృద్ధి సాదిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల పరిణామాలుంటాయి. కొత్త పనులు గానీ కొత్త ఒప్పందాలు గానీ ఉంటాయి.

వృషభరాశి ( Taurus): ఇవాళ పూర్తిగా ప్రతికూలకమైన రోజుగా చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టినవారికి ఈరోజు ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు తప్పవు. దూర ప్రయాణాలు చేసి అలసిపోతారు. ఆస్తి వివాదాలు సమస్యగా మారి..ఆరోగ్యం చెడిపోతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు తప్పవు. 

మిధునరాశి ( Gemini) ఈ రాశివారికి ఇవాళ ఇబ్బందులు తప్పవు. కుటుంబంలో ఒత్తిడి తీవ్రమై బంధువులతో తగాదాలు ఎదురవుతాయి. మీరు అనుకున్న పనులేవీ ఇవాళ విజయవంతంగా సాగవు. ఆలోచన పరివిధాలుగా సాగుతూ ఏ పనీ చేయలేరు. ఉద్యోగ, వ్యాపారాల్లో అస్పష్టత వేధిస్తుంది.

కర్కాటకరాశి ( Cancer): ఈ రాశివారికి అంతా అనుకూలమే. అన్నీ సానుకూలంగా జరుగుతాయి. ముఖ్యంగా ఊహించని ధనలాభముంటుంది. భూమిపై పెట్టిన పెట్టుబడి లాభాలు కలగజేస్తుంది. సన్నిహితులతో సఖ్యత, కీలక నిర్ణయాలు అవసరం. ఉద్యోగ, వ్యాపారాల్లో మాత్రం అస్పష్టత ఉంటుంది. 

సింహరాశి (Leo): ఈ రాశిలోవారికి ఇవాళ ప్రతికూలమైన రోజుగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారస్థులకు అనుకున్న పనులేవీ పూర్తికావు. కుటుంబంలో చిన్న చిన్న విషయాల్లో చికాకు కలుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు వెంటాడుతాయి. ఆర్ధికంగా ఇబ్బంది పడతారు. 

కన్యారాశి ( Virgo):ఈ రాశివారికి అన్నీ అనుకూలమే. అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. ఇచ్చిన అప్పులేమైనా ఉంటే ఇవాళ వసూలవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్దికంగా ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారవర్గాల్లో కొత్త ఉత్సాహం కలుగుతుంది. 

తులారాశి ( Libra): ఇవాళ పూర్తిగా ప్రతికూలమైన రోజు. అనుకున్న పనులేవీ కొనసాగవు. ఇవాళ చేయాలనుకున్న పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్తగా అప్పు కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాలు వాయిదా పడి..చికాకు కలుగుతుంది. ఆర్ధికంగా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చికరాశి ( Scorpio): ఈ రాశిలో పుట్టినవారికి ఇవాళ పూర్తిగా అనుకూలంగానే ఉంటుంది. ఏ విధమైన పనులైనా జరిగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు ఆనందాన్ని కల్గిస్తాయి. ఆర్ధికంగా బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనుకున్న పనులు విజయవంతమవుతాయి.

ధనుస్సురాశి ( Sagittarius): ఇవాళ ఈ రాశివారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. చేయాల్సిన పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితి అనుకూలంగా ఉండి సక్సెస్ లభిస్తుంది. సమాజంలో గౌరవం ప్రాప్తిస్తుంది. ఆస్థి వివాదాలు సమసిపోయి..ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్థులకు మార్పు ఉంటుంది.

మకరరాశి ( Capricorn): ఈ రాశివారికి పూర్తిగా ప్రతికూలంగా ఉంటుంది. అనుకున్న పనులేవీ నెరవేరవు. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడతారు.

కుంభరాశి ( Aquarius): ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగస్థులకు, వ్యాపారస్థులకు పెద్దగా అనుకూల పరిణామాలుండవు. చేాయల్సిన పనులు ఆలస్యంగా కొనసాగుతాయి. ఆరోగ్యపరంగా కాస్త బాగుంటుంది. భూ వివాదాలు చికాకు కల్గిస్తాయి.

మీనరాశి ( Pices): ఇవాళ అంతా అనుకూలమే. అన్ని పనులు సకాలంలో జరుగుతాయి. చేయాల్సిన పనులు కార్యరూపం దాల్చడంతో విజయం లభిస్తుంది. కొత్తగా సమావేశాలకు హాజరై..గౌరవం పొందుతారు. ఉద్యోగాలు, వ్యాపారుల్లో పురోగతి లభిస్తుంది. 

Also read: కార్తీకమాసంలో...ఇవాళ నవంబర్ 29 మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News