Vikram Samvat 2080: మార్చి 22న హిందూ నూతన సంవత్సరం ప్రారంభం.. ఈ రాశులకు ప్రతి పనిలోనూ విజయం..

Vikram Samvat 2080:  హిందూ నూతన సంవత్సరం మెుదలుకానుంది. ఈ కొత్త సంవత్సరం 3 రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 12:25 PM IST
Vikram Samvat 2080: మార్చి 22న  హిందూ నూతన సంవత్సరం ప్రారంభం.. ఈ రాశులకు ప్రతి పనిలోనూ విజయం..

Vikram Samvat 2080: వేద క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం మార్చి 22, బుధవారం నాడు హిందూ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఈ కొత్త ఏడాదికి బుధుడిని రాజుగా, శుక్రుడిని మంత్రిగా భావిస్తారు. ఈ న్యూ ఇయర్ పేరు పింగల్. అలాగే ఈ దినాన అరుదైన యోగం ఏర్పడుతుంది. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు కుంభరాశిలో సంచరించనున్నాడు. అందుకే ఈ హిందూ నూతన సంవత్సరం కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకం. వీరికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

సింహ రాశి
హిందూ నూతన సంవత్సరం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో మీకు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు లభిస్తుంది. మీకు ఆధ్యాతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పాతపెట్టుబడి నుండి ప్రయోజనం పొందుతారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. 
మిథున రాశిచక్రం
కొత్త ఏడాది మీకు లాభాలను ఇస్తుంది. మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు పెట్టుబడి నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు పెద్ద డీల్ కుదర్చుకునే అవకాశం ఉంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 
ధనుస్సు రాశిచక్రం
న్యూ ఇయర్ మీకు అనుకూలంగా ఉంటుంది.  మీరు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. మీకు ఆఫీసులో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.  వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్‌లను పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

Also Read: Rajyog: 617 ఏళ్ల తర్వాత నాలుగు రాజయోగాలు.. ఇక ఈ రాశులకు పండగే పండుగ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

అండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News