Surya Dev Puja: ఆదివారం ఈ 5 వస్తువులు దానం చేస్తే సూర్య అనుగ్రహం.. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారికి 'రాగి ముక్క' పరిహారం..

Surya Dev Puja Tips and Remedies: ఆదివారం సూర్య దేవుడికి అంకితం. సూర్య దేవుడి అనుగ్రహం ద్వారా పొందే ప్రయోజనాలు, సమస్యలు తొలగిపోవడానికి చేసే పరిహారాలు ఇక్కడ తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 09:52 AM IST
  • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం సూర్య దేవుడికి అంకితం
  • సూర్య దేవుడి అనుగ్రహం పొందే మార్గమేంటి
  • సూర్య దేవుడి అనుగ్రహంతో ఏం జరుగుతుంది.. ఇక్కడ తెలుసుకోండి
Surya Dev Puja: ఆదివారం ఈ 5 వస్తువులు దానం చేస్తే సూర్య అనుగ్రహం.. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారికి 'రాగి ముక్క' పరిహారం..

Surya Dev Puja Tips and Remedies: హిందూ శాస్త్రాల ప్రకారం వారంలో ఏడు రోజులు ఆయా దేవీ దేవతలకు అంకితం చేయబడ్డాయి. భక్తులు తమ ఇష్ట దైవానికి అంకితం చేయబడిన రోజున పూజలు, ఉపవాస దీక్షలు చేసి తమ శుభం కలగజేయమని దైవాన్ని వేడుకుంటారు. ఇందులో భాగంగా ఆదివారం నాడు సూర్య భగవానుడిని పూజిస్తారు. సూర్య అనుగ్రహం పొందాలంటే రాగి కలశంలో అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఫలితంగా ఆ వ్యక్తి జాతకంలో సూర్య సంచారం బలపడుతుంది. తద్వారా అతని కీర్తి, ప్రతిష్ఠ గౌరవం పెరుగుతాయి. ఆదివారం నాడు ఏం చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదివారం ఈ ఐదింటిని దానం ఇవ్వండి :

వ్యాపార పురోగతి లేకపోయినా.. కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 

రాగి, గోధుమలు, పప్పులు, బెల్లం, ఎర్రచందనం.. ఈ ఐదు వస్తువులు సూర్యుడికి ప్రతీపాత్రమైనవి. ఈ వస్తువులను దానం చేయడం వలన ఆర్థిక పురోగతితో పాటు కెరీర్ గాడినపడుతుంది.

ప్రభుత్వ ఉద్యోగానికి ఈ పరిహారం :

ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారు ఈ పరిహారాన్ని పాటిస్తే ప్రయోజనం ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. దీని ప్రకారం.. ఒక రాగి ముక్కను తీసుకోవాలి. దాన్ని రెండుగా కత్తిరించాలి. ఒక భాగాన్ని మీవద్దే ఉంచుకుని.. మరో భాగంపై మీ కోరికను రాయాలి. ఆ రెండో భాగాన్ని నది ప్రవాహంలో వేయాలి. అంతకన్నా ముందు, మనసులో సూర్య దేవుడిని ప్రార్థించాలి. తద్వారా కోర్కెలు నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

చెడు ప్రభావం తొలగిపోవాలంటే.. :

మీపై చెడు ప్రభావం తొలగిపోవాలంటే ఆదివారం 'ఓం హరం హరిం హ్రౌం సహ సూర్యాయ నమః' మంత్రాన్ని పఠిస్తూ సూర్య భగవానుడిని పూజించాలి. ఆర్ఘ్యాన్ని సమర్పిస్తూ మంత్రం చదవాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి.అనారోగ్య సమస్యలు కూడా తొలగుతాయి. 

Also Read: Godavari Floods LIVE*: అటు గవర్నర్.. ఇటు కేసీఆర్.. వరద ప్రాంతాల్లో పోటాపోటీ పర్యటన..

Also Read: Mangla Gauri Vrat 2022: జూలై 19న శ్రావణ మొదటి మంగళవారం.. మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాలో తెలుసుకోండి...

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News