Diwali Wishes In Telugu: చెడుపై మంచి సాధించినందుకు ప్రతి సంవత్సరం దీపావళి పండుగను భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రధాన పండగల్లో ఈ దీపాల పండగ కూడా ఒకటి. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇదే రోజున రావణ సంహారం చేస్తాడు. దాదాపు శ్రీరాముడు 16 సంవత్సరాలు వనవాసం చేసి అయోధ్య పట్టణానికి తిరిగి వస్తాడు. ఇలా తిరిగి వచ్చినందుకు గాను అప్పటి ప్రజలు దీపావళి పండగను ఆరు రోజుల పాటు జరుపుకున్నారు. ఇలా త్రేతా యుగం నుంచి ఇప్పటివరకు ఈ దీపావళి పండగ కొనసాగుతూ వస్తోంది. ఈ దీపాల పండగ రోజు ప్రతి ఇంటింటికి దీపాలను వెలిగిస్తూ దీపారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి శుభ సందర్భాన లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు నచ్చిన మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.
లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
కుంకుమతో నిండి ఉన్న మీ ఇంటి మెట్ల పైనుంచి ఆ లక్ష్మీదేవి అమ్మవారు తలుపులు తెరిచి ఇంట్లోకి ఈ దీపావళి పర్వదినాన ఆనందం, సంపదతో ఇంట్లోకి రావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
దీపంలో నీ బుద్ధి ఎప్పుడు వెలగాలని కోరుకుంటూ.. ఎల్లవేళలా లక్ష్మీ గణపతి అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు.
ప్రతి సంవత్సరం ఈ దీపావళి రోజున సుఖసంతోషాలతో దీపారాధన చేయాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీవాలి శుభాకాంక్షలు.
ఈ దీపావళి పండగ మీ కుటుంబాన్ని ఆనందంతో కాంతిమయం చేయాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.
అజ్ఞానపు చీకట్లను పారద్రోలే ఈ దీపావళి పండగ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
దీపావళి పండగ అందరి జీవితాల్లోకి వెలుగు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దీవాలి పండుగ శుభాకాంక్షలు.
ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
అంధకార చీకట్లను తరిమి నూతన ప్రపంచాన్ని పిలుద్దాం..మన గుండెల్లో దాగి ఉన్న కాంతి వెలుగును తెరుద్దాం.. మీకు మీ కుటుంబ సభ్యులకు దీవాలి శుభాకాంక్షలు.
దీపాల కాంతులాగే మీకు సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆనందం కలగాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపాల పండగ శుభాకాంక్షలు.
చీకటిపై వెలుగు చెడుపై మంచి విజయానికి ప్రత్యేకగా జరుపుకునే ఈ పండగ సందర్భంగా మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా చూడాలని ఆ లక్ష్మీదేవి అమ్మవారిని కోరుకుంటూ.. దీపావళి పండుగ శుభాకాంక్షలు.
ఈ దీపావళి పండగ మీ అందరి జీవితాల్లో చీకట్లను తొలగించాలని సంతోషపు వెలుగును నింపాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి దివ్య వెలుగు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
స్నేహితులకు శ్రేయోభిలాషులకు దీపావళి పర్వదినాన ప్రత్యేక శుభాకాంక్షలు.
ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షం ఈ దీపావళి రోజున మీకు కలగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండగ శుభాకాంక్షలు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook