Guru Vakri 2023 In Telugu: బృహస్పతి గ్రహాన్ని అన్ని గ్రహాలకు గురువుగా జ్యోతిష్య శాస్త్ర పరిగణిస్తుంది. అంతేకాకుండా ఈ గ్రహం ధనుస్సు, మీనరాశిల వారిని పాలిస్తుంది. అయితే ఈ బృహస్పతి గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి మొత్తం 12 నెలల పాటు సమయం పడుతుంది. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో తిరోగమన స్థితిలో ఉంది. సెప్టెంబర్ 4న బృహస్పతి తిరోగమన స్థితిలో మార్పులు వచ్చాయి. 31 డిసెంబర్ 2023 వరకు తిరోగమన స్థితిలోనే ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి. 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో బృహస్పతి తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మేష రాశి:
దేవగురువు బృహస్పతి తిరోగమన స్థితిలో మార్పులు రావడం వల్ల ఈ రాశివారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితుల్లో కూడా భారీ మార్పులు వస్తాయి. ముఖ్యంగా తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్‌లో కూడా ఊహించని లాభాలు పొందుతారు. ఇక వ్యాపారాలు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉండబోతోంది. ఈ సమయంలో మేష రాశివారికి కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
సింహ రాశి:
ఈ బృహస్పతి గ్రహం తిరోగమన మార్పుల కారణంగా సింహ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తం లాభాలు పొందుతారు. దీంతో పాటు తల్లిదండ్రుల మద్దతు లభించి అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. ఇక పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా విజయాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మీన రాశి:
ఈ తిరోగమన ప్రభావం మీన రాశివారిపై కూడా పడుతుంది. ఈ సమయంలో వీరు కూడా ఊహించని లాభాలు పొందుతారు. డిసెంబర్ 31 వరకు జీవితంలో సానుకూల ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి