Guru Vakri 2023: జ్యోతిష్య శాస్త్రంలో ఆనందం, సంపద, విలాసానికి కారకుడైన బృహస్పతి సెప్టెంబర్ 4న మేషరాశిలోకి తిరోగమనం చేయబోతోంది. ఈ గ్రహం దాదాపు 118 రోజుల పాటు తిరోగమనంలో ఉండబోతోంది. ఆ తర్వాత డిసెంబర్ 23న మేష రాశిలోకి ప్రత్యేక్ష సంచారం చేయనుంది. ఈ సంచార ప్రభావం మొత్తం 12 రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బృహస్పతి తిరోగమన కాలం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా మారుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో..ఏయే రాశులవారు జాగ్రత్తలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బృహస్పతి తిరోగమనం కారణంగా మకర రాశివారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా లక్ష్యాల వైపు ముందుకు సాగుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారు ఊహించని భవనాలతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సమయంలో వీరికి సంపాదన పరంగా ఎలాంటి లోటు ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీ తల్లిదండ్రుల నుంచి కూడా మంచి శుభవార్తలు వింటారు.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
బృహస్పతి అనుగ్రహంతో సింహం రాశివారి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ సులభంగా నెరవేరుతాయి. ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారికి కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. అంతేకాకుండా వీరు ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. వీరు తెలివితేటల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో పాటు అద్భుతమైన అవకాశాలు పొంది..ఊహించని లాభాలు పొందుతారు. ఇక పిల్లలు ఉన్నవారు కూడా ఈ సమయంలో వారి నుంచి శుభవార్తలు వింటారు.
బృహస్పతి తిరోగమనం కారణంగా ధనుస్సు రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కుటుంబ వ్యవహారాలు కూడా సులభంగా మెరుగుపడతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా నష్టపోతున్న ఈ రాశివారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పొదుపు చేసే క్రమంలో కూడా సులభంగా విజయాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook