Blessings of jupiter : కొత్త ఏడాదిలో ఆ మూడు రాశులకు తిరుగులేదు.. బృహస్పతి అనుగ్రహంతో అంతా శుభమే!

Blessings of jupiter will be on these 3 zodiac signs : బృహస్పతి మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మూడు రాశుల వారి ఆదాయం పెరుగుతుంది. ఏ రాశి వారికైనా గురువు అనుగ్రహం ఉంటే వారికి అడ్డే ఉండదు కదా. మరి 2022లో బృహస్పతి అనుగ్రహం ఏ రాశులపై ఉందో ఒకసారి చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 05:40 PM IST
  • బృహస్పతి, దేవ గురువు, గురుడు.. పరివర్తనం
  • బృహస్పతి మరొక రాశిలోకి మారడంతో కొన్ని రాశులకు శుభప్రదం
  • కొత్త ఏడాదిలో మూడు రాశులకు తిరుగులేదు
 Blessings of jupiter : కొత్త ఏడాదిలో ఆ మూడు రాశులకు తిరుగులేదు.. బృహస్పతి అనుగ్రహంతో అంతా శుభమే!

Guru rashi Transit jupiter will enter pisces in 2022 the blessings of jupiter will be on these 3 zodiac signs: బృహస్పతిని జ్యోతిష్యశాస్త్రంలో ముఖ్యమైన గ్రహంగా పేర్కొంటారు. బృహస్పతి దేవ గురువు అలాగే గురుడు అని కూడా అంటారు. బృహస్పతి పరివర్తనం వల్ల చాలా రాశులపై ప్రభావం పడనుంది. బృహస్పతి (jupiter) మరొక రాశిలోకి మారడం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. కొన్ని రాశులకు ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు.

బృహస్పతిని (Brihaspati) ఏప్రిల్ 13, 2022 న తన సొంత రాశి అయిన మీన రాశిలో ప్రవేశిస్తారు. బృహస్పతి ఇలా మీన రాశిలోకి (Pisces) వచ్చి సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ఆ రాశులకు బృహస్పతి రాశి పరివర్తనం అదృష్టంగా మారనుంది. కొత్త ఏడాదిలో (New Year) మూడు రాశులకు మేలు జరగుతుంది. 

బృహస్పతి మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మూడు రాశుల ( 3 zodiac signs) వారి ఆదాయం పెరుగుతుంది. ఏ రాశి వారికైనా గురువు అనుగ్రహం ఉంటే వారికి అడ్డే ఉండదు కదా. మరి 2022లో బృహస్పతి అనుగ్రహం ఏ రాశులపై ఉందో ఒకసారి చూడండి.

వృశ్చికం - (Scorpio)

వృశ్చికం రాశి వారిపై బృహస్పతి అనుగ్రహం ఉంటుంది. మీన రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా, వృత్తిపరంగా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. పలు మార్గాల్లో వృశ్చిక రాశి వారికి సంపాదన పెరుగుతూ పోతూ ఉంటుంది.

ధనుస్సు - (Sagittarius)

బృహస్పతి రాశి మారడం వల్ల ధనుస్సు రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది. వీరిని అదృష్టం వరిస్తుంది. వ్యాపారం చేసే వ్యక్తులు లాభపడతారు. ఈ రాశి వారిపై బృహస్పతి అనుగ్రహం ఎంతో బాగుంటుంది.

Also Read : Trolls on Hero Nani: హీరో నానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. సినిమా టికెట్లపై స్పందించడమే కారణమా?

కుంభం - (Aquarius)
బృహస్పతి రాశి పరివర్తనంతో కుంభ రాశి వారికి కలిసొస్తుంది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే కుంభం రాశి వారు డబ్బును కూడబెట్టుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. మొత్తానికి ఈ మూడు రాశులకు 2022వ సంవత్సరంలో (2022 year) తిరుగు లేదు. అన్ని రకాలుగా ఈ రాశుల (zodiac signs) వారు లాభపడతారు.

Also Read : Harbhajan Singh Retirement: హర్భజన్ సింగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News