Guru Rashi Parivartan in April 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ముఖ్యమైన గ్రహా సంచారాలన్నీ ఏప్రిల్ లో జరగబోతున్నాయి. అందులో ఒకటి బృహస్పతి సంచారం. గ్రహాల అధిపతిగా పిలిచే గురుడు ఏప్రిల్ 23, 2023న, తెల్లవారుజామున 3:33 గంటలకు తన సొంత రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మళ్లీ బృహస్పతి ఏప్రిల్ 27, 2023, మధ్యాహ్నం 2:07 గంటలకు అదే రాశిలో ఉదయిస్తాడు. దీని వల్ల నాలుగు రాశులవారిపై డబ్బు వర్షం కురుస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
గురు గోచారం ఈ రాశులకు వరం
మేషరాశి
ఇదే రాశిలో బృహస్పతి సంచారం జరగనుంది. ఇది మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఈ సమయం ప్రత్యేకంగా ఉండబోతుంది. విద్యార్థులు అనుకున్న రిజల్ట్ పొందుతారు. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బృహస్పతి యొక్క రాశి మార్పు శుభప్రదంగా ఉంటుంది. గురుడు సంచార సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు పనిలో విజయం సాధిస్తారు. మీ జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.
సింహరాశి
గురుడు సంచారం సింహరాశి వారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. మీరు అనుకున్నది సాధిస్తారు.
తులారాశి
బృహస్పతి యొక్క ఈ సంచారం తుల రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు లైఫ్ పార్టనర్ తో మంచి సమయాన్ని గడుపుతారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార పరంగా ఈ సమయం అద్భుతంగా ఉండబోతుంది.
Also Read: Surya Gochar 2023: వేరే రాశిలోకి ట్రావెల్ చేయనున్న సూర్యుడు.. ఇక ఈ 6 రాశులవారు పట్టిందల్లా బంగారం..
Also Read: Oil For Beard Growth: గడ్డం పొడవుగా పెంచుకోవాలనుకుంటున్నారా? ఈ నూనె 10 రోజుల్లో గ్రోత్ రావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి