Guru Purnima 2022: ఈ రోజే గురు పూర్ణిమ.. ఒకే రోజు 4 రాజ యోగాలు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం..

Guru Purnima 2022: హిందువులు పవిత్రంగా భావించే గురు పూర్ణిమ నాడు 4 రాజ యోగాలు కూడా ఏర్పడుతుండటం 3 రాశుల వారికి విశేషంగా కలిసిరానుంది.   

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 13, 2022, 09:29 AM IST
  • రేపు గురు పూర్ణిమ
  • అదే రోజు 4 రాజ యోగాలు
  • రాశిచక్రంలోని 3 రాశుల వారికి అదృష్ట యోగం
Guru Purnima 2022: ఈ రోజే గురు పూర్ణిమ.. ఒకే రోజు 4 రాజ యోగాలు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం..

Guru Purnima 2022: హిందూ శాస్త్రాల ప్రకారం ఆషాఢ మాసంలో ఏర్పడే పౌర్ణమిని వ్యాస పూర్ణమిగా జరుపుకుంటారు. దీన్నే గురు పూర్ణిమ అని కూడా పిలుస్తారు. మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడి జయంతిని ఇలా గురు పూర్ణిమగా జరుపకుంటారు. దేశవ్యాప్తంగా హిందువులు ఈ రోజే (జూలై 13) గురు పూర్ణిమ జరుపుకోనున్నారు. జ్యోతిష్యపరంగా ఈసారి గురు పూర్ణిమ నాడు 4 రాజ యోగాలు ఏర్పడబోతున్నాయి. కుజుడు, బుధుడు, బృహస్పతి, శని శుభ స్థానాల్లో సంచరిస్తున్నందునా రుచక్, భద్ర, హన్స్, షష్ అనే 4 రాజ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగాలు రాశిచక్రంలోని 3 రాశుల వారికి అదృష్టాన్నితీసుకురానుంది.

ఈ 3 రాశుల వారికి అదృష్టం

వృషభం: గురు పూర్ణిమ రాజ యోగాలు వృషభ రాశి వారికి చాలా శుభ సంకేతాలు. ఆర్థికంగా ఈ రాశి వారికి బాగా కలిసొస్తుంది. ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది. వ్యాపారులకు సాధారణ రోజుల్లో కన్నా ఎక్కువ లాభం ఉంటుంది. కేవలం మీ నోటి మాటతో కొన్ని పనులు జరిగిపోతాయి. మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఉద్యోగ, రాజకీయ రంగంలో ఉన్నవారికి హోదా పెరుగుతుంది.

సింహం : రాజ యోగాలు సింహ రాశి వారిని రాజులా మారుస్తాయని చెప్పొచ్చు. ఏ విషయంలోనూ వీరికి లోటు ఉండదు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. పొదుపుతో భారీగా డబ్బు కూడబెడుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. ఒకానొక పెద్ద ఆర్డర్ ద్వారా భారీగా డబ్బు చేకూరుతుంది. 

కన్య: ఈ రాజయోగాలు కన్య రాశి వారికి వరమనే చెప్పాలి. ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. లేదా పదోన్నతి వేతన పెరుగుదల ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభపడుతారు. కొత్త ఆర్డర్స్ లేదా బిజినెస్ ఒప్పందాలు జరుగుతాయి. 

(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Hyderabad Floods: హుస్సేన్ సాగర్ గేట్లు ఓపెన్.. వరద గండంలో హైదరాబాద్.. జీహెచ్ఎంసీ హై అలెర్ట్

Also Read: Vegetable Prices: భారీ వర్షాల ఎఫెక్ట్.. సామాన్యులకు షాకిస్తున్న కూరగాయల ధరలు... 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News