Guru Margi 24 November 2022: ఈ రాశువారికి గురు మార్గి వల్ల విపరీతమైన డబ్బే..డబ్బు..

Guru Margi 24 November 2022: బృహస్పతి గ్రహ సంచారం వల్ల కొన్ని రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రాశువారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశాలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 09:47 AM IST
  • మీన రాశిలోకి బృహస్పతి గ్రహ సంచారం..
  • 5 రాశువారు ఉద్యోగంలో ప్రమోషన్స్‌..
  • జీతాలు, ఊహించని డబ్బు పొందుతారు.
Guru Margi 24 November 2022: ఈ రాశువారికి గురు మార్గి వల్ల విపరీతమైన డబ్బే..డబ్బు..

Guru Margi 24 November 2022:  బృహస్పతి గ్రహాన్ని దేవగురువుగా పరిగణిస్తాడు. ఈ గ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ బృహస్పతి గ్రహం అనుగ్రహం ఉంటే మనిషి చాలా రకాల ప్రయోజనాలతో పాటు అదృష్టాన్ని కూడా పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహం ప్రభావం వల్ల అన్ని రాశుల జీవితాల్లో విజయాలు సాధిస్తారు. అయితే ప్రస్తుతం బృహస్పతి గ్రహం సంచారం జరగబోతోంది. ఈ రోజే గ్రహం రివర్స్ దిశలో కదలబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 22, 2023 వరకు బృహస్పతి ఒకే గ్రహంలో ఉండడం వల్ల పలు రాశువారి జీవితాల్లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి.

గురువు మార్గి వల్ల కలిగే ప్రయోజనాలు:

వృషభం:
ఈ రాశి వారికి సంచారం వల్ల వృత్తి సంబంధ సమస్యలు తీరుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో లాభనష్టాల వల్ల ఆనందాన్ని అనుభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారి ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా పొందుతారు. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

కర్కాటక:
బృహస్పతి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశి వారు ఉద్యోగ-వ్యాపారాలలో పురోభివృద్ధిని పొందే అవకాశాలున్నాయి.  జీవితంలో పోరాడుతున్న కష్టాల నుంచి ఈ క్రమంలో విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఈ క్రమంలో సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది.

కన్య:
కన్య రాశి వారికి గురు ప్రత్యక్ష సంచారం వల్ల ఉద్యోగ, వ్యాపారులకు భారీ లాభాలు చేకూరుతాయి. ఈ క్రమంలో పనులు వేగంగా జరుగుతాయి.  అంతేకాకుండా ఏదైన పనిలో కష్టపడితే ప్రయోజనం ఉంటుందని శాస్త్ర నిపుణలు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా పాత వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చిక :
గురుగ్రహ సంచారం ప్రభావం వల్ల ఈ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగంలో ప్రమోషన్, జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంచారం క్రమంలో వ్యాపారాలు చేస్తే సులభంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ రాశి వారు సంచారం కారణంగా పలు అంశాలపై జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి:
దేవగురువు బృహస్పతి సంచారం వల్ల తులారాశి, ధనుస్సు, మీన, మిధునరాశి వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుంగా మేషం, సింహ, మకర రాశువారు కూడా జాగ్రత్తలు పాటిస్తే మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో వీరు పెట్టుబడులు పెడితే నష్టాలపాలయ్యే అవకాశాలున్నాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read : Bihar Road accident: భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు... 12 మంది దుర్మరణం..

Also Read : Telangana: అయ్యప్ప పూజకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ... ఐదుగురు దుర్మరణం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News