Guru Gochar 2023: అనుకోకుండా బృహస్పతి ఆ రాశిలోకి సంచారం, ఈ రాశిలవారు ముట్టింది బంగారం అవ్వడం ఖాయం!

Guru Gochar 2023: మార్చి నెలలో బృహస్పతి మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో పలు రాశువారి జీవితంలో మార్పలు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2023, 10:03 AM IST
Guru Gochar 2023: అనుకోకుండా బృహస్పతి ఆ రాశిలోకి సంచారం, ఈ రాశిలవారు ముట్టింది బంగారం అవ్వడం ఖాయం!

Guru Gochar 2023: మార్చి నెలలో చాలా గ్రహాలు వాటి సొంత రాశులను వదిలి ఇతర రాశిల్లోకి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా దేవగురువు  బృహస్పతి కూడా ఈ నెల చివరిలో ఇతర రాశిలోకి సంచారం చేయబోతుంది. దీంతో పలు రాశులవారి జీవితాల్లో మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం పలు రాశులవారికి శుభప్రదంగా ఉంటే పలు రాశులవారికి దుష్ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మార్చి 28న బృహస్పతి గ్రహం మీనరాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే పలు రాశులవారి జీవితంలో జ్ఞానం, విద్య, మతం, వృత్తి పరంగా చిన్న మార్పులు జరిగే అవకాశాలున్నాయి. అయితే పలు రాశులవారికి దీని ప్రభావం తీవ్రంగా పడితే మరికొన్ని రాశులవారికి ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ బృహస్పతి సంచారం ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.

మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ సంచారం చాలా శుభప్రదంగా, ఫల ప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సమాజంలో వీరిపై ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల కష్టమైన పనులు కూడా సులువుగా పూర్తవుతాయి. విద్యార్థులకు చదువులపై ఆసక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

సింహరాశి:
బృహస్పతి గ్రహ సంచారం వల్ల ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా ఆనందం, శాంతి కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది. కాబట్టి ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతరలతో మంచి సంబంధాలు ఏర్పడతాయి.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి బృహస్పతి శుభప్రదంగా ఉండబోతున్నాడు. దీంతో స్నేహితులతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. పార్ట్ టైమ్ ఆదాయ వనరుగా మారుతుంది. కుటుంబంతో కలిసి షికారుకి వెళ్లవచ్చు. ఈ క్రమంలో వారి పట్ల ప్రేమను కూడా పొందే ఛాన్స్‌ ఉంది.

Also read: Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Also read: Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News