Guru Asta 2023: ఈ రాశులవారి పరిస్థితులు హీనంగా మారబోతున్నాయా?, ఏలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది!

Guru Asta 2023 Dates: బృహస్పతి గ్రహం వచ్చే నెలలో ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో పలు రాశులవారి జీవితాల్లో తీవ్ర మార్పులు రాబోతున్నాయి. అయితే ఎయే రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 11:46 AM IST
Guru Asta 2023: ఈ రాశులవారి పరిస్థితులు హీనంగా మారబోతున్నాయా?, ఏలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది!

Guru Asta 2023 Dates: బృహస్పతి గ్రహాన్ని జ్ఞానం, శుభ కార్యాలకు సూచికగా జ్యోతిష్య శాస్త్రంలో భావిస్తారు. ఏప్రిల్ 1న బృహస్పతి తన సొంత రాశి మీన రాశిలో సంచారం చేయబోతోంది. అయితే ఈ గ్రహం మీన రాశిలో దాదాపు నెల పాటు అదే రాశిలో సంచార దిశలో ఉండబోతోంది. దీని కారణంగా అన్ని రాశులవారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ మంచి రోజులు ఏప్రిల్‌ 1 నుంచే ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో అన్ని రాశులవారు ఎలాంటి పనులు చేసిన మంచి లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో కొన్ని రాశులవారికి నష్టాలు కలిగే ఛాన్స్‌ కూడా ఉంది. అయితే ఏయే రాశువారిపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశుల వారు మే 3 వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే!
మేషరాశి:

బృహస్పతి సంచారం వల్ల మేషరాశి వారిపై చాలా ప్రభావం పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన ఈ క్రమంలో మధ్యలోనే ఆగిపోతాయి. అంతేకాకుండా తీవ్ర అడ్డంకులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ గ్రహ సంచారం తర్వాత కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

వృషభం:
ఈ సంచారం ప్రభావం వల్ల మేషరాశి వారి ఆదాయ వనరులు తగ్గిపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో పనిచేసే వారు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే తీవ్ర సమస్యల్లో చిక్కుకునే అవకాశాలున్నాయి. కుటుంబంలో కలహలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కూల్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో కూడా విభేదాలు రావొచ్చు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.

కర్కాటక:
కర్కాటక రాశివారికి బృహస్పతి గ్రహం చెడు ప్రభావం తీసుకు రాబోతోంది. ఈ క్రమంలో మీరు కష్టపడి పనులు చేసిన ఎలాంటి ఫలితాలు పొందలేరు. దీంతో అన్ని పనుల్లో అడ్డంకులు వచ్చే అవకాశాలున్నాయి. ప్రేమ జీవితంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. కాబట్టి పలు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది.

ధనుస్సు:
ఈ గ్రహ సంచారం ధనుస్సు రాశి వారిపై కూడా పడబోతోంది. దీంతో వీరి ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా భయపడిపోతారు. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా ప్రభావం పడడంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు

Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News