July Gochar 2023: జూలై నెలలో ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?

Venus transit 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఇతడిని లవ్, రొమాన్స్, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా భావిస్తారు. జూలైలో శుక్రుడి రాశి మార్పు ఏయే రాశులవారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2023, 04:45 PM IST
July Gochar 2023: జూలై నెలలో ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?

Shukra Gochar In July 2023: ఆస్ట్రాలజీలో ప్రతి గ్రహానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా గ్రహాల సంచారం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. జూలై నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పురాబోతుంది. ఇందులో శుక్రుడు కూడా ఒకరు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు జూలై 07న సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులవారికి ఆకస్మిక ధనలాభం కలుగనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

శుక్రుడి సంచారం ఈ 3 రాశులకు వరం
తులారాశి
సింహరాశిలో శుక్రుని సంచారం తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీ ఆదాయ గృహంలో శుక్రుడు సంచరించబోతున్నాడు. దీంతో తులరాశి వారి ఆదాయం విపరీతంగా పెరగనుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీకు లక్ కలిసి వస్తుంది. మీ ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీకు ధనలాభం పెరుగుతుంది. 
వృషభం
వృషభ రాశి వారికి శుక్రుని సంచార ప్రభావం శుభప్రదంగా ఉంటుంది. మీ రాశి యెుక్క జాతకంలో నాల్గవ ఇంట్లో ఈ సంచారం జరగబోతుంది. దీంతో మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మీకు స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. 

Also Read: Budh Asta 2023 Date: బుధుడి అస్తమయంతో మారిన ఈ రాశుల అదృష్టం, ఇక వీరికి తిరుగుండదు..

కుంభ రాశి
సింహరాశిలో శుక్రుని ప్రవేశం కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఈ రాశి యెుక్క ఏడవ ఇంట్లో శుక్రుడి సంచారం జరగబోతుంది. దీంతో మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉండబోతుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీకు లాభం ఉంటుంది. ప్రేమికుల మధ్య సంబంధాలు బలపడతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: Chandra Grahan 2023 Date: చివరి చంద్ర గ్రహణం ఎప్పుడు, మన దేశంపై దీని ప్రభావం తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News