Ganesh Chaturthi 2022: వినాయక నవరాత్రుల్లో గణేషుడికి ఈ నైవేద్యాలను సమర్పిస్తే.. కోరుకున్న కోరికలన్ని నెరవేరుతాయి..

Ganesh Chaturthi Puja Vidhi: భారత్‌లో వినాయక చవితికి ఓ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షం నాల్గవ రోజున జరుపుకుంటారు. గణేశుడిని పూజిస్తే అన్ని దేవతల అనుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2022, 06:27 PM IST
  • వినాయక నవరాత్రుల్లో 10 రోజుల పాటు
  • మోదకాలు మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా
  • గణపతికి సమర్పించవచ్చు..
Ganesh Chaturthi 2022: వినాయక నవరాత్రుల్లో గణేషుడికి ఈ నైవేద్యాలను సమర్పిస్తే.. కోరుకున్న కోరికలన్ని నెరవేరుతాయి..

Ganesh Chaturthi Puja Vidhi: భారత్‌లో వినాయక చవితికి ఓ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షం నాల్గవ రోజున జరుపుకుంటారు. గణేశుడిని పూజిస్తే అన్ని దేవతల అనుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మం. అయితే ఈ ఏడాది 31 ఆగస్టు 2022 గణేష్‌ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు పది రోజుల తర్వాత సెప్టంబర్‌ 09న ముగియనున్నాయి. అయితే ఈ నవ రాత్రుల్లో గణేషునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలను మీకు తెలియజేస్తున్నాం. అయితే ఈ ప్రసాదాలను రోజూ పూజా కార్యక్రమంలో సమర్పిస్తే కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును కలుగుతుందని శాస్త్రం పేర్కొంది.

పది పాటు ఈ  నైవేద్యలు  సమర్పించాలి:

>>మోదకాలు అంటే వినాయకునికి చాలా ఇష్టం. కాబట్టి చవితి రోజూ మోదకాలను సమర్పించాలి.
>>నవరాత్రుల్లో రెండవ రోజు గణపతికి మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా సమర్పించవచ్చు.
>>మూడవ రోజు వినాయకుని పూజలో శనగపిండి లడ్డూలను పెట్టొచ్చు.
>> గణేశుడికి నాలుగవ రోజూ అరటిపండు సమర్పించడం చాలా మంచిదని సనాతన ధర్మంలో పేర్కొన్నారు. కాబట్టి ఆ రోజూ తప్పకుండా అరటి పండ్లను ప్రసాదంగా పెట్టాలి.
>>ఐదవ రోజు నైవేద్యంగా ఖీర్ పెట్టొచ్చు.
>>నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు గణపతికి ప్రసాదంగా కొబ్బరికాయను సమర్పించండి.
>>7వ రోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూలను పెట్టొచ్చు.
>>వినాయక నవ రాత్రి వేడుకల్లో భాగంగా 8వ రోజూ పాలతో చేసిన కలకండ్‌ను పూజలో వినాయకునికి సమర్పించండి.
>>9వ రోజూ స్వామికి కుంకుమపువ్వు, పాలతో చేసిన మిశ్రమాన్ని నైవేద్యంగా పెట్టొచ్చు.
>>నవరాత్రుల్లో చివరి రోజు వివిధ రకాల మోదకాలను సమర్పిస్తే.. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..

Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News