Vastu Tips for Home Cleaning : మన శరీరం లాగే ఇంటిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతాం కాబట్టి.. అది మనసు, ఆరోగ్యం, ఆర్థిక స్థితి గతులపై ప్రభావం చూపుతుంది. అందుకే వాస్తు శాస్త్రంలో ఇంటి పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. దానికి కొన్ని నియమాలు కూడా సూచించారు. ఆ నియమాలు పాటించినట్లయితే.. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మిదేవీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది.
బ్రహ్మముహూర్తం లేదా సూర్యాస్తమయ సమయంలో ఇంటిని ఊడ్చకూడదు. బ్రహ్మముహూర్తం తర్వాత నుంచి సూర్యాస్తమయ మధ్య కాలంలోనే ఇంటిని ఊడ్చుకోవాలి. ఒకవేళ బ్రహ్మ ముహూర్తం లేదా సూర్యాస్తమయ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీ దేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే, రాత్రిపూట కూడా పొరపాటున ఇంటిని ఊడ్చవద్దు. ఒకవేళ రాత్రిపూట చెత్తను ఊడిస్తే మరుసటి రోజు ఉదయం దాన్ని బయట పడవేయండి.
ఇంట్లోని బాత్రూమ్-టాయిలెట్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సాలె గూళ్లు లేకుండా చూసుకోండి. బాత్రూమ్-టాయిలెట్ కారణంగా ఏదైనా వాస్తు దోషం ఉంటే.. ఉప్పు నింపిన గిన్నెను ఒక మూలలో ఉంచి, ప్రతి వారం ఉప్పును మార్చండి.
ఇంటి నాలుగు మూలలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఉత్తరం, పడమర వైపున ఎల్లప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచండి.
వారానికి ఒకసారి, సముద్రపు ఉప్పుతో ఇంటి ఫ్లోర్‌ను తుడవండి. ఇది ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అయితే గురువారం ఇంటిని తుడవొద్దనే విషయం గుర్తుంచుకోండి.
బాల్కనీ లేదా ఇంటి పైకప్పుపై విరిగిన, ఉపయోగించలేని వస్తువులను ఉంచవద్దు. అలా ఉంచితే పేదరికం దరిచేరుతుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారాన్ని ZEE NEWS ధృవీకరించలేదని గమనించగలరు.)
Also Read: వేములవాడ ముస్లిం మత పెద్దల సంచలన తీర్మానం... ఇకపై పెళ్లిళ్లలో ఒకే కూర, ఒకే స్వీటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook