Chandra grahanam 2022: ఏడాదిలో తొలి చంద్రగ్రహణం ఇవాళ. అందుకే 2022లో ఆ నాలుగు రాశులవారికి గుడ్‌న్యూస్ మోసుకొస్తోంది. కెరీర్ పరంగా ఆ రాశులవారికి ఇక తిరుగుండదట. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ వివరాలు చూద్దాం..
2022లో తొలి చంద్ర గ్రహణం ఇవాళ అంటే మే 16, 2022న ఏర్పడింది. ఈ చంద్ర గ్రహణం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వృశ్చిక రాశిలో ఏర్పడుతోంది. దీంతోపాటు హిందూమతంలో అత్యంత పవిత్రంగా భావించే వైశాఖ పౌర్ణిమ కూడా. ఇవాళ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. గ్రహాలు, నక్షత్రాల స్థితి ఇవాళ చాలా బాగుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. చంద్రగ్రహణం ప్రభావం ఇండియాలో లేకపోయినా..సూతకకాలం లేకపోయినా..ప్రభావం మాత్రం అన్నిరాశులపై ఉంటుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారికైతే అత్యంత శుభసూచకం.
ఏ రాశులవారికి అదృష్టం
ఈ ఏడాది అంటే 2022లో తొలి చంద్ర గ్రహణం మేషరాశి జాతకులపై అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పరంగా వృద్ధి ఉంటుంది. వారి వర్క్‌ప్లేస్‌పై ప్రభావం పడుతుంది. కొత్త ఆఫర్లు రావడం, ఆదాయం పెరగడం ఖాయం. కుటుంబసభ్యులతో సంబంధాలు బాగుంటాయి. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి.
వృషభరాశి వారికి ఈ ఏడాది చంద్ర గ్రహణ ప్రభావంతో అంతా శుభం కలుగుతుంది. ఈ రాశివారి కెరీర్‌లో కలిగే మార్పు భవిష్యత్‌కు చాలా మంచిది. ఆదాయం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రజాదరణ పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి.
సింహరాశివారిపై చంద్రగ్రహణం ప్రభావం సానుకూలంగా ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సింహరాశివారి కెరీర్‌పై వెన్నెల కురిపిస్తుంది. పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కష్టపడి పనిచేస్తే కచ్చితంగా ఫలితాలుంటాయి. మాటతీరు మెరుగుపర్చుకుంటే ఇక తిరుగుండదంటున్నారు పండితులు.
ధనస్సురాశివారిపై చంద్రగ్రహణం ప్రభావం పాజిటివ్‌గా ఉంటుంది. ఈ రాశివారి పనుల్లో ప్రగతి కన్పిస్తుంది. ఇప్పటి వరకూ వృద్ధి కోసం నిరీక్షించినవారి కలలు నెరవేరుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితం ఆనందమయంగా ఉంటుంది.
Also read: Vaisakha Purnima 2022: వైశాఖ పౌర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ నాడు ఏం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.