/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Dussehra 2022: విజయదశమి ప్రతి సంవత్సరం శుక్లపక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. దసరా రోజున శ్రీరాముడు లంకాపతైన రావణుని సంహరించినందుకుగాను ఈ విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో అధర్మం కూడా నాశనం అయిందని భారతీయలు నమ్ముతారు. ఇంకొందరైయితే.. అధర్మం పై సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని నమ్ముతారు.

అయితే ఈ ఏడాది విజయదశమి అక్టోబర్ 5న వచ్చింది. ఈ అక్టోబర్ 5 నవరాత్రుల్లో చివరి రోజు కాబట్టి.. భక్తులంతా దుర్గామాతను పూజించి ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల దుర్గామాత ఆశీస్సులు లభిస్తాయ ని భక్తుల నమ్మకం.. అయితే ఈ ఉపవాసాల క్రమంలో పలు పుష్పాల మొక్కలను పూజించడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ పూల మొక్కలు ఏంటో..? పూజలను ఎలా చేయాలో..? మనం ఇప్పుడు తెలుసుకుందాం..

విజయదశమి రోజున దేవతామూర్తులకు ఎంతో ఇష్టమైన పారిజాత పుష్పాలను పూజిస్తే.. భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవి చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. వీటి నుంచి వచ్చే సువాసన అంతో ఇంతో కాదు. ఈ పువ్వులను అర్చన క్రమంలో దేవాలయాల్లో వినియోగిస్తారు.

ఈ పూలను ఎలా పూజించాలి..?:
విజయదశమి రోజున అపరిజాత పుష్పాలను పూజించడం శుభప్రదంగా భావించవచ్చు. ఇవి ఏడాది పొడవునా లభిస్తాయి. అయితే ఈ పూలను అమ్మవారికి అలంకరించి పూజించడం వల్ల అన్ని రంగాల్లో విజయాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా మధ్యలో ఆగిపోయిన పనులు కూడా సజావుగా సాగుతాయట..

భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందడానికి ఈ మొక్కను ఈశాన్యంలో నాటి.. ఆ మొక్క ముందు తామర ఆకులను పరిచి వాటిపై అపరిజాత పుష్పాలనుంచి.." మాం సకుటుంబస్య క్షేం సిద్ధయర్థే అపరాజిత పూజన్ కరిష్యే " ఈ మంత్రాన్ని పఠించాలి. ఇలా నవరాత్రుల్లో చివరి రోజు చేయడం వల్ల మీ కోరికలు తీరడమే కాకుండా ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి.

అయితే ఈ మంత్రాన్ని పఠించిన తర్వాత ఆ చెట్టుకి మీరు నైవేద్యాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించి.. చెట్టుకు పసుపు కుంకుమతో అలంకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెయ్యితో తయారుచేసిన నైవేద్యాన్ని చెట్టు ముందు ఉంచి.. కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ పైన పేర్కొన్న మంత్రాన్ని పాటించాలి.

Also Read: Bathukamma 2022 Wishes: తెలంగాణ ప్రజలందరికీ పూల పండగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

Also Read: Dussehra 2022 Date: దసరా రోజూ చేయాల్సి కార్యక్రమాలు ఇవే.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Section: 
English Title: 
Dussehra 2022: If You Worship Parijata Flower Tree On Dussehra 2022 Will Get Success In All Fields Also Get Money
News Source: 
Home Title: 

Dussehra 2022: విజయదశమి రోజున ఈ పుష్పాల మొక్కను పూజిస్తే డబ్బే..డబ్బు..

Dussehra 2022: విజయదశమి రోజున ఈ పుష్పాల మొక్కను పూజిస్తే డబ్బే..డబ్బు..
Caption: 
Source: ZEE TELUGU NEWS
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

దసరా రోజున పారిజాత పుష్పాల మొక్కను పూజిస్తే..

 భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు.

అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు.

Mobile Title: 
Dussehra 2022: విజయదశమి రోజున ఈ పుష్పాల మొక్కను పూజిస్తే డబ్బే..డబ్బు..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, October 4, 2022 - 11:36
Request Count: 
46
Is Breaking News: 
No