Dussehra 2020: శమీ పూజ.. పాలపిట్ట దర్శనం ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?

ఆశ్వీయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులపాటు దేవిశరన్నవరాత్రుల్లో (navaratri 2020) భాగంగా కనకదుర్గా దేవిని రోజుకొక అవతారంలో భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆశ్వీయుజ దశమినాడు ‘దసరా’ (Dussehra 2020) లేదా విజయదశమిగా జరుపుకుంటారు. అయితే దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది శమీపూజ (జమ్మిచెట్టు) (Jammy Chettu), పాలపిట్ట (Palapitta) దర్శనం.

Last Updated : Oct 25, 2020, 09:10 AM IST
Dussehra 2020: శమీ పూజ.. పాలపిట్ట దర్శనం ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?

Dussehra 2020: Importance of Jammy Chettu Puja, Palapitta Darshan: ఆశ్వీయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులపాటు దేవిశరన్నవరాత్రుల్లో (navaratri 2020) భాగంగా కనకదుర్గా దేవిని రోజుకొక అవతారంలో భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆశ్వీయుజ దశమినాడు ‘దసరా’ (Dussehra 2020) లేదా విజయదశమిగా జరుపుకుంటారు. చెడుపై విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. అయితే దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది శమీపూజ (జమ్మిచెట్టు) (Jammy Chettu), పాలపిట్ట (Palapitta) దర్శనం. దశమి రోజు శమీపూజ చాలా ముఖ్యమైనది. దసరా రోజు సాయంత్రం వేళ జమ్మిచెట్టు (Jand Plants) ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీర్వచనాలు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో భాగం. అయితే.. దసరా రోజునే జమ్మిచెట్టును పూజించడం, ఆతర్వాత పాలపిట్టను దర్శించుకోవడం వల్ల  సర్వ కార్యాలు సిద్ధిస్తాయని ప్రజల్లో అపార నమ్మకం. వీటికి పలు ఇతిహాసాలు సాక్షత్కారమిస్తున్నాయి.. ( Importance of Jammi Chettu ) అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* విజయదశమి నాడు.. రాముడు విజయదశమి నాడు అపరాజితాదేవి (శమీ వృక్షము) ను పూజించి, రావణుడిని సహరించాడు. 
* దీంతోపాటు పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీవృక్షంపైనే దాచిపెట్టారని.. ఆ సమయంలో విరాటరాజు కొలువులో ఉన్న పాండవులు.. ఏడాది షరతు పూర్తికాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను పొందారని చెబుతారు. అయితే శమీవృక్ష రూపంలోని ‘అపరాజితా దేవి’ ఆశీస్సులు పొంది పాండవులు కౌరవులపై విజయం సాధించారని పండితులు పేర్కొంటారు. అయితే పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ... అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం కూడా.
* అదేవిధంగా దుర్గాదేవి మహిషాసురుడితో నవరాత్రులపాటు యుద్ధం చేసి రక్షసుడిని వధించింది. ఈ సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంతో దశమి నాడు విజయదశమి పండగ జరుపుకున్నారు. 
* నవరాత్రుల్లో చివరి మూడురోజుల్లో దేవదానవులు పాల సముద్రం మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే ‘విజయదశమి’గా జరుపుకుంటారని పండితులు పేర్కొంటారు. 

దీనిలో భాగంగా దసరా (విజయదశమి) రోజున శమీపూజ అనంతరం ‘పాలపిట్ట’ను చూసే సంప్రదాయం ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు. ఈ సందర్భంగా ఈ శ్లోకాన్ని పఠిస్తూ..  మూడు సార్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
శమీ పూజ శ్లోకం..
‘‘ శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ, 
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.. 
శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా, 
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ. 
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా, 
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.'' 

శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుంది.  అమ్మవారి కృప, శనిదోష నివారణ జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. దీంతోపాటు శమీ నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. కావున యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తూ.. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కావున శమీ పూజ అనంతరం జమ్మి ఆకులను పెద్దల చెతికి అందించి వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనాలు పొందుతారు. శమీ పూజ సందర్భంగా పాలపిట్ట దర్శనం కోసం ప్రజలు తహతహలాడతారు. ఇందుకు కారణం పాల పిట్ట దర్శనంతో సర్వ కార్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. అందుకే శమీ పూజ అనంతరం పాలపిట్టను దర్శించుకుని ఆనందంగా ఇళ్లకు చేరుకుంటారు. ALSO READ| Krishna : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు

ALSO READ|  Bhagavad Gita Lessons:  కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 10 జీవిత సత్యాలు

Trending News