Venus Transit 2024: ఫిబ్రవరిలో ఈ రాశుల వారిపై శుక్రుడు వరాల జల్లు..ఏం చేసినా ధనమే..ధనం..

Venus Transit In Sagittarius 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో శుక్ర గ్రహం సంచారం చేయబోతోంది. ఈ సంచారం కారణంగా రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ ప్రభావంతో ఏయే రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2024, 10:58 AM IST
Venus Transit 2024: ఫిబ్రవరిలో ఈ రాశుల వారిపై శుక్రుడు వరాల జల్లు..ఏం చేసినా ధనమే..ధనం..

Venus Transit In Sagittarius 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక సమయాల్లో గ్రహాలు రాశి సంచారం కూడా చేస్తాయి. అన్ని గ్రహాలు 12 రాశుల్లో సంచారం చేసి తన సొంత రాశిలోకి చేరుకుంటాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాలలో శుక్ర గ్రహం ఒకటి ఈ గ్రహం సంచారం చేసినప్పుడల్లా ప్రత్యక్ష ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. అయితే ఐశ్వర్యం, ప్రేమ, శృంగారానికి ప్రతీకగా పరిగణించే ఈ శుక్ర గ్రహం ఫిబ్రవరి నెలలో రాశి సంచారం చేయబోతోంది. జన్మ నక్షత్రంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే అన్ని రంగాలలో ఫలితాలు పొందుతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే భౌతిక సుఖాలను పొందడమే కాకుండా ప్రేమ జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. దీంతోపాటు సంపాదన శ్రేయస్సు కూడా లభిస్తుంది. అయితే శుక్ర గ్రహం ఫిబ్రవరి 12న మకర రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం మార్చి ఆరవ తేదీ వరకు అదే గ్రహంలో సంచార దిశలో ఉంటుంది. దీని కారణంగా మకర రాశి వారికే కాకుండా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి శుక్ర గ్రహం పదవ స్థానంలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల చాలా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఉద్యోగాలు చేసే వారికి తోటి ఉద్యోగుల మద్దతు లభించి కఠినమైన పనులను కూడా సులభంగా చేస్తారు. దీనికి కారణంగా ఆఫీసుల్లో ప్రశంసలు కూడా పొందుతారు. దీంతోపాటు వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం ఎన్నో విజయాలను అందించబోతోంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అలాగే ఫిబ్రవరి నుంచి ఈ రాశి వారికి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి దీనికి కారణంగా కొత్త వాహనాలు గృహాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి జాతకంలో ఈ సంచారం ఏడవ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా వీరు వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ప్రేమ జీవితం వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుటుంబంతో కూడా సమయాన్ని గడుపుతూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో తల్లి మద్దతు లభించి వ్యాపారాల్లో ఊహించని లాభాలు కూడా పొందుతారు. దీంతోపాటు స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

మకర రాశి:
ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు ఈ నెలలో అనేక శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంబంధాలు మరింత బలంగా మారుతాయి. ఇక వైవాహిక జీవితం గడుపుతున్న వారికి భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభించి ఎలాంటి కఠిన తరమైన పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కుటుంబ సమస్యలు తొలగిపోయే ఛాన్స్ కూడా ఉంది. అయితే వీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News