Guru Margi 2023: డిసెంబర్ 31 నుంచి 1 సంవత్సరం పాటు ఈ రాశులవారికి గోల్డెన్‌ డేసే..ఊహించని లాభాలే లాభాలు!

Guru Margi 2023: 2024 సంవత్సరంలో జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన బృహస్పతి గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడి..ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2023, 09:30 AM IST
Guru Margi 2023: డిసెంబర్ 31 నుంచి 1 సంవత్సరం పాటు ఈ రాశులవారికి గోల్డెన్‌ డేసే..ఊహించని లాభాలే లాభాలు!

 

Guru Margi 2023: అతి త్వరలోనే 2023 సంవత్సరం ముగియబోతోంది. కొత్త సంవత్సరం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే 2024 సంవత్సరంలో కొన్ని ప్రత్యేక గ్రహాలు, నక్షత్రాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బృహస్పతి గ్రహం మేష రాశిలోకి తిరోగమనం చేయబోతోంది. డిసెంబర్ 31న ఈ తిరోగమనం జరగబోతోంది. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..బృహస్పతి ఆనందం, శ్రేయస్సు, సంపద, ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు. ఈ గ్రహం ప్రత్యేక్షంగా తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. మేషరాశి:
బృహస్పతి ప్రత్యక్ష సంచారం మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతోంది. మేష రాశి వారికి ఈ సంచారం కారణంగా గౌరవం, సంపద, వృత్తిపరమైన పురోగతి లభించబోతోంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల సులభంగా విజయాలు సాధించవచ్చు.

2. సింహ రాశి:
సింహ రాశి వారికి బృహస్పతి ప్రత్యక్ష సంచారం చేయడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రభావం కారణంగా అదృష్టం రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అదృష్టవశాత్తూ కఠినమైన పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలపడడానికి కొత్త అవకాశాలు కూడా పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఊహించని శుభావార్తలు కూడా వింటారు. 2024 సంవత్సరం మీకు చాలా శుభప్రదంగా ఉండబోతోంది.

Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!

3. ధనుస్సు రాశి:
బృహస్పతి ప్రత్యక్ష కదలికల కారణంగా ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ వాతావరణం కూడా చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. 2024 సంవత్సరంలో ఆదాయం పొందడానికి కొత్త మార్గాలు వెతుకుతారు. మీ కెరీర్‌లో కూడా కొత్త విజయాలు పొందే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News