Elinati Shani 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో నెమ్మదిగా కదిలే గ్రహాల్లో శనిగ్రహం ఒకటి. ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి దాదాపు రెండున్నర నుంచి మూడున్నర సంవత్సరాల వరకు సమయం పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏలినాటి శనితో బాధపడుతున్న వారు తప్పకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శని గ్రహం తిరోగమనం, సంచారం చేసినప్పుడల్లా ఈ ఏలినాటి శనితో బాధపడే వారి పై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. వీరు జీవితంలో అనేక సమస్యలతో పాటు బాధలను సవాలనే ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు ఎలాంటి పనులు చేసిన అనేక సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
ఏలినాటి శని ప్రభావం శని గ్రహం తిరోగమనం సంచారం చేయడం కారణంగా చాలా కాలం పాటు కొన్ని రాశుల వారిపై ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏ రాశుల వారైతే ఈ ఏలినాటి శనితో బాధపడుతున్నారు. వారు తప్పకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ శని గ్రహం మకర కుంభరాశిల వారికి అధిపతిగా అధిపతిగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం శని తులా రాశి వారికి ఉచ్చస్థితిలో మేష రాశి వారి నీచ స్థితిలో ఉన్నాడు. ఇదిలా ఉండగా జూన్ 19వ తేదీన శని కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. దీంతో ఇప్పటికే ఏలినాటి శనితో బాధపడుతున్న వారికి అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ తిరోగమనము కారణంగా ఏలినాటి శనితో బాధపడుతున్న ఐదు రాశుల వారికి ఎలా ఉంటుందో? వీరు ఈ సమయంలో పాటించాల్సిన నియమాలేంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏలినాటి శని ఏయే రాశుల వారికి ఏయే దశల్లో ఉందంటే?
మీన రాశి వారికి ఏలినాటి శని మధ్యంతర దశలో ఉంది. ఇక కుంభ రాశి వారికి రెండవ దశ, మకర రాశి వారికి మూడవ దశ కొనసాగుతోంది. దీంతో ఏలినాటి శని తో బాధపడే ఈ రాశుల వారు తిరుగమనం కారణంగా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే జీవితంలో అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా మొదటి, మధ్యంతర దశలో ఏలినాటి శనితో బాధపడేవారు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. అలాగే వైవాహిక జీవితంలో అనేక సమస్యలు రావచ్చు. దీంతోపాటు ప్రమాదాలు జరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో రుణం తీసుకోవడం మానుకుంటే ఎంతో మంచిది లేకపోతే అర్థికంగా నష్టపోయే ఛాన్స్ ఉంది. అలాగే పెట్టుబడులు పెట్టడం కూడా మానుకోవాలి. దీంతోపాటు కొత్త వాహనాలు ఇతర వస్తువులను కొనుగోలు చేయడం, దూర ప్రయాణాలు చేయడం తప్పకుండా మానుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఈ సమయంలో కర్కాటక వృశ్చిక రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు రావచ్చు. దీంతోపాటు గతంలో ఉన్న వ్యాధులు రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా ఎంతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే ఆహారాలు తీసుకునే క్రమంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు ఎలాంటి పనులు చేసిన ఆశించిన ఫలితాలు రాకపోయే అవకాశాలున్నాయి. అలాగే కష్టపడి పనిచేయడం వల్ల కొంత లాభాలు పొందే ఛాన్స్ కూడా ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
శని నివారణ:
ప్రతి శనివారం ఏలినాటి శనితో బాధపడుతున్న వారు తప్పకుండా శని మందిరాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అలాగే ఆవనూనెతో దీపాన్ని వెలిగించి శని చాలీసా పటించడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఉసిరి చెట్టు కింద ఆవనూనె దీపాన్ని వెలిగించడం వల్ల కూడా ఏలినాటి శని నుంచి కాస్తయినా విముక్తి లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి