Diwali Gift Idea: దీపావళి హిందువులకు అతి పెద్ద పండుగ. దీపావళి హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీపావళి లో భాగంగా ప్రజలంతా రాత్రి పూట లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ఇలా పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించడమే కాకుండా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని హిందువుల నమ్మకం. భారత దేశంలో చాలామంది పండుగను పురస్కరించుకొని స్నేహితులకు కానుకలను సమర్పిస్తూ ఉంటారు. ఇలా సమర్పించడం వల్ల వారికి జీవితంలో మంచి జరుగుతుందని అంతే కాకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను గిఫ్ట్ లా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రం సూచిస్తోంది. ఆ వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వస్తువులను బహుమతిగా ఇవ్వకండి:
వెండి నాణెం:
లక్ష్మి దేవికి సంబంధించిన చాలా రకాల విషయాలను వాస్తు శాస్త్రంలో వివరించారు. అయితే లక్ష్మి దేవి అచ్చులకు సంబంధించిన వెండి నాణేలను దానం చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం దూరమయ్యి. ఆర్థిక సితి మెరుగుపడే అవకాశాలున్నాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి తరచుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు కచ్చితంగా వెండి నాణేలను బహుమతులుగా ఇవ్వాలని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీపావళి సమయంలో వీటిని దానం చేయడం వల్లే మంచి ఫలితాలు పొందుతారు. ఇతర రోజులకలో ఇలా దానాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేరని శాస్త్రం చెబుతోంది.
పాదరక్షలు:
దీపావళి రోజున బూట్లు,చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు శాస్త్ర నిపుణుల సూచిస్తున్నారు. పొరపాటున కూడా ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు వివిధ కుటుంబ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పటికే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు వీటి గిఫ్ట్‌లా ఇవ్వడం మంచిది కాదు.
పెర్ఫ్యూమ్:
చాలా మంది ప్రస్తుతం దీపావళి రోజున బహుమతి రోజున పెర్ఫ్యూమ్స్ను ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల మీ జీవితంలో శుక్రుడు బలహీనుడు మరడమేకాకుండా వివిధ రకాల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి పెర్ఫ్యూమ్స్ను ఇవ్వక పోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
గాజు వస్తువులు:
చాలా మంది దీపావళి రోజున గాజు వస్తువులను బహుమతులుగా ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల జీవితంలో పలు రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వీటి గిఫ్ట్‌లా ఇవ్వడం వల్ల ప్రతి కూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read : Chinmayi Sripada Twin Babies : పిల్లలకి పాలు పడుతున్న చిన్మయి.. ఆనందంలో తేలిపోతోన్న సింగర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook