Chandra Grahan 2022: చంద్రగ్రహణం శనిదేవుడి యెుక్క ఇష్టమైన రాశులకు భారీ మెుత్తంలో డబ్బును ఇవ్వనుంది..

Chandra Grahan 2022: ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం కార్తీక పూర్ణిమ రోజున ఏర్పడుతుంది.  అయితే కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం వల్ల విశేష ప్రయోజనం కలగబోతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2022, 04:18 PM IST
Chandra Grahan 2022: చంద్రగ్రహణం శనిదేవుడి యెుక్క ఇష్టమైన రాశులకు భారీ మెుత్తంలో డబ్బును ఇవ్వనుంది..

Chandra Grahan 2022: సాధారణంగా చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం ఇవాళ అంటే కార్తీక పూర్ణిమ నాడు ఏర్పడనుంది. గ్రహణానికి 9 గంటల ముందు చంద్రగ్రహణం యెుక్క సూతకం ప్రారంభమైంది. ఇక చంద్రగ్రహణం ప్రారంభమవ్వడానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. గ్రహణం ఈరోజు సాయంత్రం 5:32 గంటలకు గ్రహణం ప్రారంభమై 6.18 గంటలకు ముగుస్తుంది.జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది శనిదేవుడి యెుక్క ప్రియమైన రాశులకు శుభప్రదంగా ఉండబోతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

తుల (Libra)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దేవుడికి ఇష్టమైన రాశిచక్రాలలో తుల రాశి ఒకటి. ఈ రాశిచక్రంలో శనిదేవుడు ఉన్నతంగా ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారిపై చంద్రగ్రహణం ఎలాంటి చెడు ప్రభావం చూపదు. మీ జీవితంలో టెన్షన్ తగ్గుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో విజయం ఉంటుంది. కెరీర్ లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. 
మకరం(Capricorn) - ఈ రాశికి అధిపతి శని. కాబట్టి చంద్రగ్రహణం ప్రభావం ఈ రాశి వారిపై పడదు. ఈ సమయంలో ఇంట్లో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఓపికగా ఉండండి, దీని వల్ల ప్రతి వ్యక్తి పనిలో విజయం సాధిస్తాడు. 
కుంభం (Aquarius)- ఈ రాశిచక్రాన్ని పాలించే గ్రహం శని దేవుడు. గ్రహణం సమయంలో ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.

Also read: Chandra Grahan 2022: నేడే చంద్రగ్రహణం.. ఈ రోజు ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోండి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News