Mercury gochar 2022: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడి అని పిలుస్తారు. జ్ఞానం, తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ కు కారకుడిగా బుధుడిని భావిస్తారు. ప్రస్తుతం బుధుడు తులరాశిలో సంచరిస్తున్నాడు. దీని సంచారం (Mercury gochar 2022) వల్ల 'అఖండ సామాజ్య్ర రాజయోగం' (Akhand Samrajya Yoga) ఏర్పడింది. ఈ యోగం వల్ల మూడు రాశులవారికి అదృష్టం కలిసి రానుంది. బుధ గ్రహం అనుగ్రహం వల్ల ఏ మూడు రాశుల వారు శుభ ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం.
బుధుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషం (Aries): మీ సంచార జాతకం యెుక్క ఏడో ఇంట్లో అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడుతోంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం ఏర్పడుతోంది. ఏదైనా పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ మరియు లాటరీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభాన్ని పొందుతారు. బుధగ్రహ ప్రభావం వల్ల వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.
మకరం (Capricorn): మీ సంచార జాతకంలో పదో ఇంట్లో అఖండ సామ్రాజ్య యోగం ఏర్పడుతోంది. మీరు వ్యాపారం మరియు వృత్తిలో మంచి విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు, బిజినెస్ చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం(Cancer): మీ జాతకంలో నాల్గో ఇంట్లో బుధుడు సంచరించాడు. ఇది మాతృస్థానంగా పరిగణిస్తారు. దీంతో మీ కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఈ సమయంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా మెరుగుపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Also Read: Shukra Gochar 2022: శుక్రుడి సంచారం.... నవంబరు 11 నుండి ఈ రాశుల జీవితం అద్భుతం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook