Budh Asta 2023: మేషరాశిలో అస్తమించనున్న బుధుడు.. ఇక ఈ 4 రాశులవారికి కష్టాలే కష్టాలు..

Budh Asta 2023: వచ్చే నెలలో బుధుడు మేష రాశిలో సంచరించనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2023, 04:25 PM IST
Budh Asta 2023: మేషరాశిలో అస్తమించనున్న బుధుడు.. ఇక ఈ 4 రాశులవారికి కష్టాలే కష్టాలు..

Budh Asta In Mesham 2023: వేద గ్రంథాలలో బుధుడును మేధస్సు మరియు తర్కానికి చిహ్నంగా భావిస్తారు. మేషరాశి యెుక్క మూడవ మరియు ఆరవ ఇంటికి బుధుడు అధిపతి. మెర్క్యూరీ ఏప్రిల్ 23న మేషరాశిలో అస్తమించనున్నాడు. బుధుడు క్షీణించడం వల్ల కొన్ని రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు. బుధుడు అస్తమించడం వల్ల నాలుగు రాశుల వారు నష్టపోనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

బుధుడి అస్తమయం ఈ రాశులకు ఇబ్బందులు
మేషరాశి
బుధుడు మేషరాశిలో ప్రవేశించడం వల్ల మీరు అనారోగ్య సమస్యలు ఎదుర్కోనున్నారు. బీపీ పెరగడం, తలనొప్పి వంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మీ పని చెడిపోయే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు. 
కర్కాటకం
ఈ రాశి వారికి బుధుడు అస్తమించడం మంచిది కాదు. మీకు వచ్చిన అవకాశాలన్నీ  చేజారిపోతాయి. మీరు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. మీరు లైఫ్ లో చాలా నష్టాలను చవిచూస్తారు. ప్రశాంతమైన మనస్సుతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తేనే విజయం సాధిస్తారు.
కన్య
మెర్క్యూరీ సెట్ మీకు అనుకూలంగా ఉండదు. మీరు మానిసిక ఒత్తిడిక గురయ్యే అవకాశం ఉంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు డబ్బును ఆదా చేయలేరు. నిరుద్యోగులకు ఉపాధి దొరకదు. ఆఫీసులో మీ సహచరులతో మీకు విభేదాలు వస్తాయి. 
ధనుస్సు రాశి
బుధుడి అస్తమయం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. వ్యాపారంలో భారీగా నష్టాలు వస్తాయి. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. మీరు డబ్బును దుబారా చేస్తారు. మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు.

Also Read: Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు ఏడు శుభ యోగాలు.. ఈరోజు ఏ పని చేపట్టినా 3 రెట్లు లాభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News