zodiac signs: అరుదైన యోగంతో ఊహించని లాభాలు పొందే రాశులవారు వీరే..నెల మొత్తం లాభాలే..

Bhadra Raja Yoga 2023: కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవడంతో అక్టోబర్‌ నెలలో భద్ర రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారపై ప్రత్యేక ప్రభావం పడి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఈ ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 5, 2023, 09:20 AM IST
zodiac signs: అరుదైన యోగంతో ఊహించని లాభాలు పొందే రాశులవారు వీరే..నెల మొత్తం లాభాలే..

 

Bhadra Raja Yoga 2023: అక్టోబర్ గ్రహ సంచారాలకు అత్యంత ముఖ్యమైన నెలగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్‌ నెలలో చాలా గ్రహాలు రాశి సంచారం చేస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని గ్రహాలు ఒక రాశిలో కలవబతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి భద్ర రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ భద్ర యోగంతో ఆ రాశులవారు అనేక రకాల లాభాలు పొందుతారట. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై యోగం ప్రత్యేక ప్రభావం:
కన్యారాశి రాశి:

కన్యారాశి వారికి బుధ గ్రహం అనుకూల స్థానంలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ రాశువారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక యోగం ఎఫెక్ట్‌తో ప్రేమ జీవితంలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరికి ఆకర్షణ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహితులు కూడా ఈ క్రమంలో చాలా రకాల లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాపారాలు చేస్తున్నవారు ఆర్థిక లాభాల కోసం కొత్త మార్గాలు వెతుకుతారు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల సహాకారంతో చాలా రకాల లాభాలు పొందుతారు. 

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి కర్మ భావంలో భద్ర రాజయోగం ఏర్పడబోతోంది. ఈ ప్రభావం నిరుద్యోగులపై అధికంగా పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరికి ఈ నెలలో ఏ సమయంలోనైన ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రమోషన్స్‌తో పాటు ఇంక్రిమెంట్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుంఆడ సహోద్యోగులతో పోటీ పడి పని చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఇక వ్యాపారాలు చేస్తున్నవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో ఏ సంస్థలో పెట్టుబడులు పెట్టిన సులభంగా విజయాలు సాధిస్తారు. 

మకర రాశి:
భద్ర రాజయోగం మకర రాశి వారి జీవితంపై కూడా ప్రత్యేక ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంతక ముందు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది చాలా సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో కష్టపడి పనులు చేయడం వల్ల అనే రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి ఈ సంచారం కారణంగా భౌతిక సుఖాలు పెరిగే అవకాశాలున్నాయి. 

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News