August Horoscope 2022: ఆగస్టు 1న రాశి మారనున్న బుధుడు.. ఈ 5 రాశుల వారికి వచ్చే నెలలో డబ్బే డబ్బు

August Horoscope 2022: ఆగస్టు 1వ తేదీన బుధ గ్రహం రాశి మారనుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న బుధ గ్రహం సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రభావం 5 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 24, 2022, 03:09 PM IST
  • ఆగస్టు 1న రాశి మారనున్న బుధ గ్రహం
  • సింహ రాశిలోకి ప్రవేశించనున్న బుధుడు
  • రాశి మార్పు 5 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది
August Horoscope 2022: ఆగస్టు 1న రాశి మారనున్న బుధుడు.. ఈ 5 రాశుల వారికి వచ్చే నెలలో డబ్బే డబ్బు

August Horoscope 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో ఒక్కో గ్రహ సంచారం ఒక్కో విధమైన ఫలితాలను కలగజేస్తుంది. రాశిచక్రంలోని ఆయా రాశుల జాతకంలో గ్రహ సంచారం ఆ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో మార్పులు తీసుకొస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధ గ్రహం ధనం, తర్కం, వ్యాపారం, తెలివితేటలకు సంకేతం. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న బుధ గ్రహం ఆగస్టు 1న సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది 5 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలను కలగజేయనుంది. ఆ రాశులు, ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 

వృషభ రాశి (Taurus) - బుధుడు రాశి మారడం వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కలిసొస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో రాబడి రెట్టింపవుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

సింహ రాశి (Leo)  - ఈ కాలంలో సింహ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా లాభాలు ఆర్జిస్తారు. వైవాహిక జీవితం ప్రేమపూర్వకంగా సాగుతుంది. కెరీర్ పరంగా ఒక స్నేహితుడి సహాయం పొందుతారు. 

కన్య (Virgo) - మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగం లేదా విద్య కోసం అనుకోని ప్రయాణాలు చేస్తారు. కెరీర్‌లో ఉన్నత స్థితికి చేరుకునేలా మార్పు జరుగుతుంది. ఉద్యోగ బదిలీ జరిగే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు.

వృశ్చికం (Scorpio) - ఈ కాలంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. వృత్తిలో ఊహించని లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకు శ్రమ అధికమైనప్పటికీ మునుపటికన్నా ఎక్కువ లాభాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. 

మీనం (Pisces) - వృత్తిలో సీనియర్ల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆఫీసులో పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే పరిస్థితులు ఉంటాయి. వృత్తిరీత్యా మీ ఆదాయం లేదా వేతనం పెరుగుతుంది. కొత్త కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Lal Darwaza Bonalu LIVE* Updates: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు...

Also Read:Maha Lakshmi Puja: లక్ష్మీ దేవిని ఇలా పూజిస్తే.. నెల రోజుల్లోనే మీరు ధనవంతులవుతారు 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News